రోగ్ ఆడియో ఫంక్షన్‌లో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది సన్నీలియోన్. అందరి కళ్లూ ఈ పోర్న్ స్టార్ మీదే. టాలీవుడ్ ఆడియో ఫంక్షన్‌లో సన్నీ చిందేయడం ఇదే తొలిసారి. అందుకే ఈ షో పై అందరూ దృష్టి సారించారు. తన పాటలకు తానే డాన్స్ చేస్తూ... రోగ్ ఆడియో ఫంక్షన్‌కి వన్నె తెచ్చింది సన్నీ. ఈ ఈవెంట్ కోసం సన్నీలియోన్‌కి ఎంతిచ్చారో తెలుసా..? అక్షరాలా రూ.25 లక్షలు. ఇంతా పోగేస్తే సన్నీ స్టేజ్ మీద ఆడిపాడింది ఐదంటే ఐదు నిమిషాలే. రూ.25 లక్షలకు గిట్టుబాటు కలిగేలానే డాన్స్ చేసి వెళ్లిపోయింది సన్నీ. అసలే రోగ్ సినిమాకి ఏమాత్రం హైప్ లేదు.. ఈ సినిమా వైపు అందరి దృష్టీ పడాలంటే ఏం చేయాలా అనుకొంటున్న పూరికి సన్నీ రూపంలో ఓ ఆధారం దొరికింది. పాతిక లక్షలిచ్చి సన్నీని ఇలా తీసుకురావడం కంటే.. ఓ ఐటెమ్ గీతంలో ఛాన్సిస్తే ఇంకా బాగుండేది కదా?? పాపం.. పూరికి ఆ ఆలోచన ఇది వరకు రాలేదేమో..? లేదంటే ఐటెమ్ గీతంలో సన్ని ప్రత్యక్షమైపోయేదే.