'నేను చెప్పిన రెండు కారణాలు తీసేస్తే అమ్మాయిలతో అబ్బాయిలకు, అబ్బాయిలతో అమ్మాయిలకూ అస్సలు అవసరం ఉండదు..' అంటోంది తమన్నా. మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తున్న తాజా చిత్రం 'నెక్ట్స్ ఏంటీ' సినిమాలోనిదీ డైలాగ్.
లేటెస్టుగా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో తమన్నా చెబుతున్న మాటలివి. అంతేనా 'అబ్బాయిల్ని ఎక్కడ కంట్రోల్ చేయాలో అంతా మీ అమ్మాయిల చేతుల్లో ఉంటుంది.. అని ఓ వ్యక్తి తమన్నాతో అంటుంటే, అవును ఆ కంట్రోల్ లేని ఏ మగాడైనా జీవిత భాగస్వామిగా సెట్ అవడు' అంటూ మరోసారి తమన్నా అబ్బాయిల విషయంలో క్లాస్ తీసుకుంటోంది. తమన్నా క్లాసుల సంగతి ఏమో కానీ, ఈ సినిమాలో తమన్నాకి జంటగా యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్నాడు. సందీప్ కిషన్‌తో మిల్కీబ్యూటీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూస్తుంటే పిచ్చెక్కిపోతోంది. ట్రైలర్‌లోనే ఇంతలా చూపించేశారు.
ఇక సినిమాలో ఇంకెంతలా ఉండబోతోందో. ఫుల్ హాట్ రొమాంటిక్ స్టోరీలా కనిపిస్తోందీ 'నెక్ట్స్ ఏంటీ' ట్రైలర్ చూస్తుంటే. మొన్నామధ్య కళ్యాణ్‌రామ్‌తో 'నా నువ్వే' సినిమాలోనూ తమన్నా ఇంతే హాట్ రొమాన్స్ పండించేసింది. ఇప్పుడు సందీప్ కిషన్‌తోనూ అంతకు మించిన గాఢమైన రొమాన్స్‌తో కిర్రాక్ పుట్టిస్తోంది తమన్నా. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ప్రేమ, ఆకర్షణ తదితర అంశాల ప్రస్థావనతో ఈ సినిమా రూపొందుతోందట.
అసలీ సినిమా కథా, కథనాల సంగతి అటుంచితే, ఇంత హాట్ అండ్ రొమాంటిక్ అప్పీల్‌తో కట్ చేసిన ఈ ట్రైలర్‌కి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చేస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ ఈ సినిమాకి దర్శకుడు. నవదీప్, పూనమ్ కౌర్ ఈ సినిమాలో మరో జంటగా నటిస్తున్నారు.