బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ సౌత్‌లో పూర్తి స్థాయి పాత్రలో నటిస్తున్న సినిమా 'వీర మహాదేవి'. ఈ సినిమాపై భారీగా బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తోంది. అది అక్షరాలా 100 కోట్లు అని ప్రచారం జరుగుతోంది. అయితే సన్నీలియోన్ స్టార్‌డమ్‌కి అంత స్టామినా ఉంటే ఉండొచ్చు గాక. కానీ సన్నీకి ఆ స్థాయిలో స్టార్‌డమ్ ఎందుకొచ్చినట్లు?
అందరూ సన్నీలియోన్‌ని హాట్ హాట్‌గా చూసేందుకే ఇష్టపడతారు. ఆమెని అలా చూసేందుకే అలవాటు పడ్డారు కూడా. అయితే ఈ సినిమాలో సన్నీలియోన్ ఎలా కనిపించబోతోంది? గతంలో విడుదల చేసిన ఫస్ట్‌లుక్ చూస్తే మసాలా దట్టించినట్లే ఉంది. బాత్ టబ్‌లో సన్నీని హాట్‌గా చూపించారు. అయితే లేటెస్టుగా విడుదలైన 'వీర మహాదేవి' లుక్‌లో సన్నీలియోన్ వారియర్‌గా కనిపిస్తోంది. మరి ఈ లుక్‌లో సన్నీని చూసేందుకు ఆడియన్స్ ఇష్టపడతారా?
అసలే ఈ సినిమా కోసం ఇంత భారీగా ఖర్చు పెట్టేస్తున్నారే. వెయ్యి గుర్రాలు, వందల సంఖ్యలో ఏనుగులు, ఏకంగా హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఘట్టాలతో ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. అడల్ట్ యాక్షన్‌లో సన్నీని చూసిన అభిమానులు, ఇలా గుర్రంపై కత్తి యుద్ధాలు చేస్తే చూస్తారా? సన్నీలియోన్‌పై ఇంత భారీ ఖర్చు, అది కూడా ఇలాంటి సబ్జెక్ట్‌తో అంటే పలు విమర్శలు ఎదురవుతున్నాయి. అయినా కానీ, సన్నీలియోన్ స్టార్‌డమ్‌పై పూర్తి నమ్మకంతోనే ఈ సినిమాని ఈ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నామని చిత్ర యూనిట్ చెబుతోంది.
చూడాలి మరి సన్నీ 'వీర మహాదేవి'గా ఏ స్థాయిలో తన అభిమానులను మెప్పిస్తుందో.!