పోర్న్ రంగం నుండి వచ్చి బాలీవుడ్లో హీరోయిన్గా క్రేజ్ సంపాదించిన హాట్ బ్యూటీ సన్నీలియోన్ సౌత్‌లో పూర్తి స్థాయి హీరోయిన్గా నటిస్తున్న చిత్రం 'వీర మహా దేవి'. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ తదితర సౌత్ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. కాగా ఇటీవల ఈ సినిమాని కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి.
చెన్నైకి చెందిన ఓ న్యాయవాది 'వీరమహాదేవి' పాత్రలో సన్నీలియోన్ నటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చెన్నై హైకోర్టులో పిటీషన్ వేశారు. వీర మహాదేవిని అక్కడి ప్రజలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. రాజేంద్ర చోళన్ భార్య అయిన వీర మహాదేవిని వీరనారిగా ప్రజలు గౌరవిస్తారు. అలాంటి పాత్రలో ఓ శృంగార తార నటిస్తే, ఆమెకు అవమానం కలిగినట్లవుతుందనీ, ఇప్పటికిప్పుడు ఆ సినిమా నుండి సన్నీలియోన్‌ని తొలగించాలనీ, లేదంటే సినిమా విడుదల నిలిపివేస్తామంటూ ఆయన వేసిన పిటీషన్ని హైకోర్టు కొట్టివేసిందనీ తాజాగా అందుతోన్న సమాచారమ్.
ఎట్టకేలకు ఈ సమాచారంతో సన్నీలియోన్ సినిమాకి లైన్ క్లియర్ అయినట్లేనని తెలుస్తోంది. గతంలో 'కరెంట్ తీగ', గరుడవేగ' వంటి తెలుగు చిత్రాల్లో సన్నీలియోన్ స్పెషల్ సాంగ్స్‌లో నటించింది. ఈ సినిమాతో పూర్తి స్థాయి హీరోయిన్గా సౌత్ ప్రేక్షకుల్ని కనువిందు చేయనుంది.