'వీర మహా' లెవల్‌ కసరత్తులు

By iQlikMovies - April 24, 2018 - 12:04 PM IST

మరిన్ని వార్తలు

పోర్న్‌ రంగం నుండి ఇండియన్‌ సినిమాకి పరిచయమైన బ్యూటీ సన్నీలియోన్‌, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా, ఐటెం గాళ్‌గా సత్తా చాటింది. ఇప్పుడిప్పుడే దక్షిణాది సినీ పరిశ్రమలో బిజీ అవుతోంది. ఆల్రెడీ తెలుగులో రెండు సినిమాల్లో నటించింది సన్నీలియోన్‌. అప్పుడెప్పుడో 'కరెంట్‌తీగ' చిత్రంలో కొన్ని సన్నివేశాలతో పాటు, ఐటెం సాంగ్‌లోనూ కనిపించింది. ఇటీవల 'గరుడవేగ' చిత్రంలో ఐటెం సాంగ్‌లో నటించి దుమ్ము దులిపేసింది. 

ఇప్పుడు సౌత్‌లో ఓ పూర్తి స్థాయి హీరోయిన్‌ పాత్రలో కనిపించనుంది. అదే 'వీరమహాదేవి' చిత్రం. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తనకు సౌత్‌లో మంచి పేరు తీసుకొస్తుందని ఆశా భావం వ్యక్తం చేస్తోంది సన్నీలియోన్‌. ఈ సినిమా కోసం అమ్మడు చాలా కష్టపడుతోంది. తెగ కసరత్తులు చేస్తోంది. కొంచెం బొద్దుగా ఉండే సన్నీలియోన్‌ ఈ సినిమా కోసం బాగా ఫిట్‌గా మారుతోందట. 

అంతేకాదు, కత్తిసాములు, గుర్రపుస్వారీలు వంటి ప్రత్యేక విద్యల్లో ప్రత్యేక శిక్షణ కూడా పొందుతోందట. సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సన్నీలియోన్‌ లేటెస్టుగా ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ఓ టిపికల్‌ వర్కవుట్‌ ట్రై చేస్తోంది ఆ వీడియోలో సన్నీలియోన్‌. ట్విట్టర్‌లో సన్నీలియోన్‌ ఫాలోయింగ్‌ సంగతి తెలిసిందే. అందుకే ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అయ్యింది. పోస్ట్‌ చేసిన చాలా కొద్ది సమయానికే 17 వేలకు పైగా ఈ వీడియోని వీక్షించారు. అదీ మన వీర మహా సన్నీలియోన్‌ స్టామినా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS