ఒక టైటిల్ విషయంలో ఎన్టీఆర్, కృష్ణ మధ్య కోల్డ్ వార్ జరిగింది. కృష్ణ తనయుడు రమేష్ బాబు హీరోగా 'సామ్రాట్' అనే టైటిల్ తో సినిమాని నిర్మించారు. ఇది రమేష్ బాబుకి మొదటి సినిమా. అయితే బాలకృష్ణ, విజయశాంతి హీరోహీరోయిన్లుగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో సామ్రాట్ పేరుతోనే సినిమా చేశారు.
అయితే రెండు సినిమాల పేర్లు ఒకటే అవ్వడంతో డైరెక్ట్ గా ఎన్టీఆర్, కృష్ణ ఈ విషయంపై చర్చించారు. అయితే ఈ విషయంలో కృష్ణ మొండిపట్టుపట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఈ టైటిల్ ని కృష్ణకే వదిలేశారు. బాలకృష్ణ నటించిన సినిమా పేరును 'సాహస సామ్రాట్' గా మార్చారు. ఈ చిత్రం యావరేజ్ గా నిలవగా... రమేష్ బాబు సామ్రాట్ మాత్రం విజయం సాధించింది.