సినిమా ధియేటర్లలో జనగణమన నిబంధన తీర్పు వెలువడిన క్షణం నుండి ఏదో ఒక వివాదస్పద విషయం జరుగుతూనే ఉంది.
ఇలాంటి తరుణంలో సుప్రీమ్ కోర్టు ఈ నిభందనలో ఒక స్వల్ప మార్పుకి అంగీకారం తెలిపింది. అది ఏంటంటే, ధియేటర్లో ప్రదర్శింపబడుతున్న సినిమాలో కాని లేక డాక్యుమెంటరీలో కాని జాతీయ గీతం ఆలపించినప్పుడు తప్పకుండా అందరు లేచి నిలబడాలీ అనే నిభందనను తొలగించారు.
ఈ తీర్పుతో ఇక ప్రేక్షకులు తాము చూసే సినిమాల్లో జాతీయ గీతం ఆలపించే సన్నివేశం వచ్చినప్పుడు లేచి నిలబడడం లేక నిలబడకపోవడం అనేది వారి ఇష్టానికి వదిలేసినట్టయింది.