ప్ర‌భాస్‌కి గురి పెట్టిన మ‌రో ద‌ర్శ‌కుడు.

మరిన్ని వార్తలు

ప్ర‌భాస్‌తో సినిమా తీయ‌డానికి ద‌ర్శ‌కులంతా పోటీ ప‌డిపోతున్నారు. ప్ర‌భాస్ కాల్షీట్లు దొరికాయంటే ఆ నిర్మాత జాక్ పాట్ కొట్టిన‌ట్టే. బాహుబలి త‌ర‌వాత ఎంత రేంజ్ పెరిగినా, ఎక్క‌డా హ‌డావుడి ప‌డ‌కుండా, త‌న ఇమేజ్‌ని, క్రేజ్‌ని పెంచే క‌థ‌ల‌నే ఎంచుకుంటున్నాడు. అందుకే ఒక్కో సినిమా రెండేళ్లు ప‌డుతోంది. దాంతో.. ప్ర‌భాస్ ముందు ద‌ర్శ‌కుల క్యూ పెరిగిపోతోంది. ప్ర‌భాస్ కోసం ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త క‌థ‌లు త‌యార‌వుతూనే ఉన్నాయి. కాక‌పోతే.. వాటిని ప్ర‌భాస్ ఓకే చేయ‌డం లేదు.

 

తాజాగా ప్ర‌భాస్ కోసం ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ఓ క‌థని సిద్ధం చేసిన‌ట్టు స‌మాచారం. 'ధృవ‌', 'సైరా'తో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టాడు సూరి. ఎప్ప‌టి నుంచో ప్ర‌భాస్ తో సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. కానీ కుద‌ర‌డం లేదు. `సైరా` హిట్టు త‌ర‌వాత సూరిపై మిగిలిన హీరోలంద‌రి దృష్టి ప‌డ‌డం ఖాయం. ప్ర‌భాస్ కూడా... సూరివైపు మొగ్గు చూపే అవ‌కాశాలున్నాయి. ప్ర‌భాస్ ఇప్పుడు స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్లు చేయ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నాడు.

 

అలాంటి సినిమాలు తీయ‌డంలో సూరి దిట్ట‌. అందుకే ఈ కాంబినేష‌న్ పక్కా అయ్యే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. కాక‌పోతే.. ప్ర‌భాస్ ఇప్పుడు హాలీడే మూడ్‌లో ఉన్నాడు. కొత్త క‌థ‌లు విన‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. సూరి క‌థ చెప్పాలి, ఆ క‌థ ప్ర‌భాస్‌కి న‌చ్చాలి. అప్పుడే.. కొత్త సినిమా క‌బురు వినిపిస్తుంది. అంత వ‌ర‌కూ వెయిట్ అండ్ సీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS