సైరాతో తన ఖాతాలో మరో సూపర్ హిట్టు వేసుకున్నాడు సురేందర్ రెడ్డి. మిగిలిన భాషల్లో `సైరా` నిరాశ పరిచినా, తెలుగులో మాత్రం మంచి వసూళ్లు అందుకుంది. నాన్ బాహుబలి రికార్డులకు దగ్గరగా వెళ్లింది. సైరా తరవాత సురేందర్ రెడ్డి ఎవరితో సినిమా చేస్తారన్న ఆసక్తికరమైన ప్రశ్న మొదలైంది. పలువురు పెద్ద హీరోలకు కథలు చెప్పడానికి సూరి సమాయాత్తం అవుతున్నాడు. అయితే ఈలోగా వరుణ్‌తేజ్‌తో సూరి సినిమా ఫిక్సయ్యింది.
అయితే ఈ సినిమాకి సురేందర్ రెడ్డి కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తాడని తెలుస్తోంది. అవును... సురేందర్ రెడ్డి త్వరలోనే సొంత నిర్మాణ సంస్థపై సినిమాలు చేయబోతున్నాడు. అందులో భాగంగా వరుణ్‌తో ఓ సినిమా చేస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే కూడా తానే సమకూరుస్తాడట. తన శిష్యుడికి దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తాడని తెలుస్తోంది.