స్వీట్ షాక్ ఇచ్చిన సురేష్ ప్రొడక్షన్స్!

మరిన్ని వార్తలు

సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడం, ప్రచారం హోరెత్తించి సినిమాపై ఆసక్తిని పెంచిన తర్వాత సినిమాలను రిలీజ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఓటీటీల రాకతో సినిమా రిలీజులో పద్ధతులు మారిపోతున్నాయి. సినిమాను ప్రకటించిన డేట్ కంటే నాలుగు గంటల ముందు చెప్పా పెట్టకుండా స్ట్రీమింగ్ చెయ్యడం, ముందస్తు సమాచారం లేకుండా రిలీజ్ చెయ్యడం కామన్ అవుతున్నాయి.

 

తాజాగా 'కృష్ణ అండ్ హిస్ లీల' సినిమా రిలీజ్ చాలామందికి ఓ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. 'క్షణం' ఫేమ్ రవికాంత్ పేరెపు దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాథ్, షాలిని వడ్నికట్టి, సీరత్ కపూర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు ఈమధ్యే ప్రమోషన్స్ ప్రారంభించారు. ఓటీటీ వేదికగా సినిమాను విడుదల చేస్తారని అన్నారు. సినిమాకు సురేష్ ప్రొడక్షన్స్ వారు ప్రొడక్షన్ పార్టనర్స్ గా వ్యవహరించడం, ప్రోమోస్ ఆసక్తిని కలిగించడంతో ప్రేక్షకులు ఏ ఓటీటీ వేదికలో రిలీజ్ అవుతుంది? ఎప్పుడు విడుదల అవుతుంది? ఇలాంటి సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు.

 

అయితే ఈ సమాచారం అసలేమాత్రం ఇవ్వకుండానే నెట్ ఫ్లిక్స్ లో 25న బుధవారం, రాత్రి విడుదల చేయడంతో షాక్ కావడం జనాల వంతయింది. ఇక నిన్న ఉదయాన్నే రివ్యూలు రావడంతో అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది అంటూ కొందరు ముక్కున వేలేసుకున్నారు. అంటే దీన్ని బట్టి ఇకపై రిలీజ్ డేట్ చెప్పకుండా, ఓటీటీ వేదిక ఏదో సమాచారం ఇవ్వకుండా రిలీజ్ చేసినా ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఉరుములేని పిడుగులా ఎప్పుడైనా సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ పక్కన పెడితే సినిమాకు మాత్రం మంచి టాకే వచ్చింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS