ఆదివారం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఓ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చిరు హాజరయ్యారు. అయితే ఆయన చేతికి కట్టు కనిపించింది. ఆ ఫొటోలన్నీవైరల్ అయ్యాయి. దాంతో.. చిరంజీవి ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. చిరంజీవి చేతికి ఏమైందంటూ ఆరాలు తీస్తున్నారు. దీనిపై చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. చిరు కుడి చేయికి చిన్నపాటి సర్జరీ జరిగిందట. కుడి చేతితో ఏ పని చేయాలన్నా కొంచెం నొప్పిగా, తిమ్మిరి ఏర్పడుతున్నట్టు అనిపించడంతో చిరంజీవి డాక్టర్ ను సంప్రదించారు.
కుడి చేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్ నర్వ్ అనే నరం మీద ఒత్తిడి పడటం వల్ల తిమ్మిరిగా అనిపిస్తోందని దానిని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారని వైద్యుల చెప్పార్ట. చిన్నపాటి ఆపరేషన్ అవసరమైందని, అపోలో ఆసుపత్రిలో కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేతికి సర్జరీ జరిగిందని.. 45 నిమిషాల పాటు జరిగిన సర్జరీలో మీడియన్ నర్వ్ చుట్టుపక్కల ఉన్న టిష్యూలను సర్జరీ ద్వారా సరి చేసి, ఒత్తిడి తగ్గించారని మెగాస్టార్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ నిమిత్తం 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సివచ్చిందట. అందుకే గాడ్ ఫాదర్ షూటింగ్ కూడా వాయిదా వేశారని తెలుస్తోంది.