ఇటీవల 'ఎన్జీకే' చిత్రంతో విడుదలకు ముందు భారీ అంచనాలు నమోదు చేసి, విడుదలయ్యాక ఆకట్టుకోలేకపోయిన సూర్య త్వరలో 'బందోబస్తు' సినిమాతో వస్తున్నాడు. తమిళంలో 'కాప్పన్'గా తెరకెక్కిన ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని సూర్య ఫస్ట్‌లుక్ విడుదల చేశారు.
ఈ లుక్‌లో సూర్య సూట్ వేసుకుని చేతిలో గన్ పట్టుకుని, కళ్లకు కళ్లజోడు, డిఫరెంట్‌గా డిజైన్ చేసిన లైట్ గెడ్డం, సైడ్ క్రాఫ్‌తో సీరియస్ లుక్స్‌తో సమ్‌థింగ్ డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. చూస్తుంటే ఏదో అత్యున్నత స్థాయి పోలీస్ అధికార పాత్రలా కనిపిస్తోంది. ఏదో ఛేజింగ్‌కి సంబంధించిన స్ట్రైక్‌లో సూర్య పాల్గొన్నట్లుంది ఈ లుక్‌లో ఆయన బాడీ లాంగ్వేజ్.
'రంగం' సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కె.వి.ఆనంద్ ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమాలో సూర్యతో పాటు, రియల్ లైఫ్ దంపతులు సాయేషా, ఆర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ బొమన్ ఇరానీ, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాస్టింగ్ పరంగా చూస్తుంటే, ఇదో భారీ బందోబస్తు సినిమాగానే పరిగణించాలి. హ్యారిస్ జై. రాజ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.