తమిళనాడులో హీరో సూర్య కుటుంబం పై పెద్ద వివాదమే నడుస్తుంది. కారణం.. సూర్య భార్య , నటి జ్యోతిక చేసిన కామెంట్స్. తంజావూరు బృహదీశ్వర ఆలయానికి సంబంధించి.. ఆలయ నిర్వహణకు, పునరుద్ధరణకు పెట్టే ఖర్చును, ఆలయ హుండీలో వేసే డబ్బును ఆస్పత్రుల్లో వసతుల కల్పనకు కేటాయించాలని జ్యోతిక వ్యాఖ్యనించింది. అయితే ఇది ఇప్పుడు కాదు. చాలా రోజుల క్రితం. అయితే ఇప్పుడా వీడియో వైరల్ అయ్యింది. కరోనా నేపధ్యంలో ఇప్పుడు దేశంలో అలాంటి పరిస్థితి నెలకొంది. దీంతో జ్యోతికకి సపోర్ట్ గా చాలా మంది మాట్లాడారు.
అయితే దీనిపై పలు హిందూ సంఘాలు, అర్చకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆచారలని, సంప్రాదాయాలని మంటగలిపేలా ఇలాంటి వ్యాఖ్యలు తగవని కొన్ని హిందూ సంఘాలు సూర్యని టార్గెట్ చేశాయి. అయితే సూర్య మాత్రం వెనకడుగు వేయలేదు. ''నా భార్య చేసిన వ్యాఖ్యాలకు కట్టుబడి వున్నానని, తనకి తన అభిప్రాయం చెప్పే హక్కు వుందని, ఈ విషయంలో నా సంపూర్ణ మద్దత్తు నా భార్యకేనని'' ఓ ప్రకటన విడుదల చేశాడు సూర్య. ఆయన విడుదల చేసిన ప్రకటనపై కూడా ప్రసంసల జల్లు కురుస్తుంది. బేసిగ్గా ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు ఏ వర్గానికి కూడా దూరం కాకూడదని రాజీపదిపోతుంటారు సెలబ్రటీలు. కానీ సూర్య మాత్రం ఏదేమైనా తన భార్యపక్కనే నిలబడాలని నిర్ణయించుకోవడం గొప్ప విషయమే. నిజంగా ఆదర్శ భర్త సూర్య.