త్రివిక్ర‌మ్... బోయ‌పాటి... మ‌ధ్య‌లో సూర్య‌

By iQlikMovies - June 20, 2021 - 12:12 PM IST

మరిన్ని వార్తలు

ఈమ‌ధ్య త‌మిళ హీరోల దృష్టి టాలీవుడ్ పై ప‌డింది. తెలుగులో నేరుగా చేయ‌డానికి వాళ్లంతా ఉత్సాహం చూపిస్తున్నారు. విజ‌య్ - వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. కార్తి కూడా తెలుగులో సినిమాలు చేయ‌డం పై ఫోక‌స్ చేశాడు. ఇప్పుడు సూర్య వంతు వ‌చ్చింది. సూర్య కోసం బోయ‌పాటి శ్రీ‌ను ఓ క‌థ సిద్ధం చేస్తున్నాడ‌ని టాలీవుడ్ కోడై కూస్తోంది. ఇప్పుడు త్రివిక్ర‌మ్ కూడా సూర్య‌తో సినిమా చేయ‌డానికి స‌మాయాత్తం అవుతున్నాడ‌ని టాక్‌.

 

నిజానికి.. త్రివిక్ర‌మ్ - సూర్య కాంబో గురించిన చ‌ర్చ ఇప్ప‌టిది కాదు. `అఆ` స‌మ‌యంలోనే ఇద్ద‌రి మ‌ధ్యా చ‌ర్చ‌లు జ‌రిగాయి. కానీ కుద‌ర్లేదు. సూర్య‌తో సినిమా చేయాల‌ని ఇద్ద‌రు ముగ్గురు ద‌ర్శ‌కులు గ‌ట్టిగా అనుకున్నారు. ఎవ‌రి ప్ర‌య‌త్నాలూ వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. కానీ త్రివిక్ర‌మ్, బోయ‌పాటి లాంటి ద‌ర్శ‌కులు క‌థ‌లు చెబితే - సూర్య కాద‌న‌లేడు. సూర్య కూడా ఈ ఇద్ద‌రితో సినిమా చేయ‌డానికి రెడీగానే ఉన్నాడ‌ట‌. బోయ‌పాటి శ్రీ‌ను ఇప్ప‌టికే క‌థ చెప్పేశాడ‌ని, త్రివిక్ర‌మ్ తో త్వ‌ర‌లోనే అప్పాయింట్ మెంట్ ఉంద‌ని స‌మాచారం. మ‌రి ఈ ఇద్ద‌రిలో సూర్య ఓటు ఎవ‌రికో?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS