హ‌నుమాన్‌లో జయ‌మ్మ‌?!

By iQlikMovies - June 20, 2021 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్ కుమార్‌.. ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు. `క్రాక్‌`, `నంది` చిత్రాల‌లో వైవిధ్య‌భ‌రిత‌మైన న‌ట‌న ప్ర‌ద‌ర్శించింది. కాస్త నెగిటీవ్ ట‌చ్ ఉండి, ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లేమైనా ఉంటే, అది కాస్త వ‌ర‌క్ష్మి ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోతున్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ - గోపీచంద్ మ‌లినేని సినిమాలో వ‌ర‌లక్ష్మికి మంచి పాత్ర దొరికిన‌ట్టు టాక్‌. ఇప్పుడు త‌న ఖాతాలో మ‌రో సినిమా వేసుకుంది.

 

`అ`, `క‌ల్కి`, `జాంబీరెడ్డి` సినిమాల‌తో త‌న‌దైన మార్క్ వేసుకున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇప్పుడు `హ‌నుమాన్‌` అనే సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. ఫాంట‌సీ, సైన్స్ ఫిక్ష‌న్ క‌ల‌గ‌లిపిన క‌థ ఇది. `జాంబీరెడ్డి` తేజ‌నే ఇందులో హీరో అని తెలుస్తోంది. ఓ కీల‌క‌మైన పాత్ర‌లో జ‌య‌మ్మ క‌నిపించ‌బోతోంద‌ట‌. జ‌య‌మ్మ‌ది... నెగిటీవ్ ట‌చ్ ఉన్న పాత్ర అని స‌మాచారం. ఈ సినిమా కోసం జ‌య‌మ్మ‌కు భారీ పారితోషికం కూడా ముట్ట‌జెప్పార్ట‌. వ‌చ్చే నెల‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS