పుష్ప వచ్చి చాలా కాలమైంది. అన్నీ కుదిరితే.. ఈ డిసెంబరులోనే పుష్ప 2 కూడా బయటకు వచ్చేయాలి. కానీ... పుష్ప సూపర్ డూపర్ హిట్ అయిపోవడంతో, పుష్ప 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టు స్క్రిప్టులో మార్పులూ, చేర్పులూ చేసుకొంటూ వెళ్లాడు సుకుమార్. అందుకే ఆలస్యమైంది. ఇప్పుడిప్పుడే పుష్ప 2కి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే.. త్వరలో పుష్ప నుంచి ఓ సర్‌ప్రైజ్ రాబోతోందని టాక్.
డిసెంబరు 16న అవతార్ 2 విడుదల కాబోతోంది. ఈ సినిమా ఆడుతున్న థియేటర్లలో పుష్ప 2 టీజర్ ని ప్రదర్శిస్తారని టాక్. ఈ టీజర్‌లోనే.. పుష్ప 2 రిలీజ్ డేట్‌పై ఓ స్పష్టమైన ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో పుష్ప 2 కోసం ఓ ప్రత్యేకమైన సెట్ రూపొందించారు. అక్కడ ఈ గ్లిమ్స్‌కి సంబంధించిన షూటింగ్ జరగబోతోందట. 2023 డిసెంబరులో పుష్ప 2 విడుదలయ్యే అవకాశాలున్నాయి. మైత్రీ మూవీస్ రూపొందించిన ఈ చిత్రంలో రష్మిక కథానాయిక. సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.