వరుణ్‌ కావాలనే అలా చేశాడా?

By Inkmantra - September 26, 2019 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

ఎప్పుడూ నామినేషన్‌లో ఉండే రాహుల్‌ సిప్లింగజ్‌ కోసం వరుణ్‌ సందేశ్‌ ఈ సారి త్యాగం చేశాడు. రాహుల్‌ని నామినేషన్‌ నుండి సేవ్‌ చేయమని ఇంటి సభ్యుల్ని కోరి, రాహుల్‌ ప్లేస్‌లో తాను నామినేట్‌ అయ్యాడు. వరుణ్‌ వన్‌ ఆఫ్‌ ది స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అన్న సంగతి తెలిసిందే. హౌస్‌లో మిగిలిన కంటెస్టెంట్స్‌ నుండి కూడా వరుణ్‌ పట్ల మంచి అభిప్రాయముంది. బయటి నుండీ వరుణ్‌కి సపోర్ట్‌ బాగానే ఉంది.

 

అయితే, ఎందుకో వరుణ్‌ తాజా ఎపిసోడ్‌లో కాస్త వింతగా ప్రవర్తించాడు. ఏదో సింపథీ కొట్టేయాలని ట్రై చేశాడు. ఆ క్రమంలో రాహుల్‌ని బ్యాడ్‌ చేయాలనుకున్నాడు. ప్రత్యేకంగా రాహుల్‌ ఆటిట్యూడ్‌ని మెచ్చుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు బిగ్‌బాస్‌ ఆడియన్స్‌లో. హౌస్‌లో పునర్నవి, రాహుల్‌ పెయిర్‌కి ఓ స్పెషాలిటీ ఉంది. ఆడవాళ్ల పట్ల రాహుల్‌ బిహేవియర్‌ అయినా, టాస్క్‌ల్లో అవతలి వాళ్లని హర్ట్‌ చేయకూడదనే ఉద్దేశ్యంతో తన గేమ్‌ని తాను గివ్‌ అప్‌ చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. రాహుల్‌ స్వచ్ఛమైన నవ్వుకే బోలెడంత మంది ఫ్యాన్స్‌ ఉన్నారు.

 

అలాంటిది పాత చరిత్రలన్నింటినీ తోడేస్తూ, ఫిజిక్‌ ఉంది కదా.. అని ఎలా పడితే అలా మీద పడిపోతారా? నేనేమైనా హౌలాగాని లెక్క కనిపిస్తున్నానా? అంటూ వరుణ్‌ చాలా రూడ్‌గా బిహేవ్‌ చేశాడు. ఈ సమయంలో రాహుల్‌కి పునర్నవి ఒక్కతే అండగా నిలిచింది. మిగిలిన కుటుంబ సభ్యులంతా వరుణ్‌ వైపే నిలిచారు. చూడాలి మరి, ఈ ఎపిసోడ్‌ రాహుల్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది.? రాహుల్‌ ఫ్యాన్స్‌ ఈ ఇష్యూని ఎలా రిసీవ్‌ చేసుకుంటారు.? నిజంగానే వరుణ్‌ తాను కోరుకున్న సింపథీని ఈ ఇష్యూతో దక్కించుకుంటాడా.? వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS