'ఫైటర్‌' కోసం 'ఇస్మార్ట్‌' థింక్‌ చేస్తోన్న రౌడీ.!

మరిన్ని వార్తలు

రౌడీ స్టార్‌తో ఇస్మార్ట్‌ బ్యూటీ జత కట్టబోతోందా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఇస్మార్ట్‌ బ్యూటీ అంటే ఇద్దరున్నారు. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌. వారిలో నభా నటేష్‌కి రౌడీ స్టార్‌తో నటించే ఛాన్స్‌ దక్కనుందంటున్నారు. రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ - పూరీ జగన్నాధ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరక్కెనున్న సంగతి తెలిసిందే. 'ఫైటర్‌' అనే పేరును ఈ సినిమాకి పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ పేరు పరిశీలిస్తున్నారట. ఆల్రెడీ పూరీ దగ్గర ఫుల్‌గా మార్కులు కొట్టేసింది 'ఇస్మార్ట్‌ శంకర్‌' ద్వారా నభా నటేష్‌.

 

ఏకంగా 'ఇలియానా 2.0' అని కితాబిచ్చేశాడు పూరీ జగన్నాధ్‌ నభాకి. సో ఒకవేళ ఈ గాసిప్‌ నిజమైతే, రౌడీస్టార్‌కి నభాతో జోడీ ఫిక్సయినట్లే. ఇదిలా ఉంటే, నభా నటేష్‌ ప్రస్తుతం ఏమంత ఖాళీగా లేదండోయ్‌. ఓ పక్క మాస్‌ రాజా రవితేజతో 'డిస్కోరాజా' సినిమాలో నటిస్తూనే, దీంతో పాటు కొన్ని కొత్త ప్రాజెక్టులు సైన్‌ చేసే దిశగా ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే నభాతో తెర వెనక బోలెడన్ని మంతనాలు జరుగుతున్నాయట. అందులో విజయ్‌ దేవరకొండ సినిమా కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

 

వాస్తవానికి నభా నటేష్‌లోని కమర్షియల్‌ నటిని బయటికి తీసుకొచ్చిన దర్శకుడు పూరీ జగన్నాధే. మరి అలాంటి నటికి తన సినిమాలో మరోసారి పూరీ ఛాన్సిస్తాడా? చూడాలి. మరోవైపు విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా పూర్తి కాగానే 'ఫైటర్‌'ని పట్టాలెక్కించనున్నాడట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS