సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాన్ని బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. సుశాంత్ లేడన్న నిజాన్ని ఆయన అభిమానులు ఇప్పటికీ నమ్మడం లేదు. తన ఆత్మహత్య చుట్టూ ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు. సుశాంత్ ది కచ్చితంగా హత్యే అని కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో సుశాంత్‌కి మరోసారి పోస్ట్ మార్టమ్ నిర్వహించారు వైద్యులు. ఈ రీ పోస్ట్ మార్టమ్ లోనూ... సుశాంత్ ది ఆత్మహత్యే అని తేలింది. శరీరంపై ఎలాంటి గాయాలూ లేవని, కచ్చితంగా ఇది ఆత్మహత్యే అని వైద్యులు ఫైనల్ రిపోర్ట్ లో తేల్చారు.
సుశాంత్ గదిని, అపార్ట్‌మెంట్‌నీ నిశితంగా పరిశీలించిన పోలీసులు కూడా ఇదే అభిప్రాయానికి వచ్చారు. దాదాపు 25 మందిని ప్రశ్నించిన పోలీసులు సైతం - సుశాంత్ ది నూటికి నూరుపాళ్లూ ఆత్మహత్యే అని ధృవీకరించారు. ఫోరెనిక్స్ లాబ్ నుంచి సైతం అలాంటి రిపోర్టే వచ్చింది. అయితే.. సుశాంత్ మృతిపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని ఇప్పుడు మరో వాదన వినిపిస్తోంది. సీబీఐ జోక్యం చేసుకుంటే గానీ, అసలు నిజాలు బయటకు రావని ఆయన అభిమానులు సైతం ముక్త కంఠంతో నినదిస్తున్నారు. రెండుసార్లు పోస్ట్ మార్టమ్ రిపోర్టులోనూ ఒకే రిజల్ట్ వచ్చిందంటే, సీబీఐ ఎంక్వైరీ కష్టమే.