హెచ్చరిక: 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు'

By Inkmantra - December 21, 2019 - 13:30 PM IST

మరిన్ని వార్తలు

ఏంటీ హెచ్చరిక అనుకుంటున్నారా.? అక్కినేని హీరో సుశాంత్‌ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్‌ ఇది. లేటెస్ట్‌గా టైటిల్‌తో పాటు మోషన్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ఓ గేటు ముందు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ నిలిపి ఉన్న పోస్టర్‌ అది. కొత్త బైక్‌. పై నుండి ఓ రోజ్‌ ఫ్లవర్‌ రాలి బైక్‌పై పడింది. కానీ, కొద్ది సేపటి తర్వాత బైక్‌ లైటు పగిలింది. కొద్దిగా చొట్ట కూడా పడింది. ఇచ్చట వాహనాలు నిలుపరాదు.. అని టైటిల్‌ పడింది. ఇదీ ఈ ఫస్ట్‌లుక్‌ స్టోరీ. ఫస్ట్‌లుక్‌ని చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా డిజైన్‌ చేశారు. డిజైన్‌ చేసిన విధానం చూస్తుంటే, ఇదేదో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీలా అనిపిస్తోంది. శాస్త్ర మూవీస్‌ ఈ సినిమాని రూపొందిస్తోంది. టైటిల్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

 

యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రంగా ఈ సినిమాని పరిచయం చేశారు. ప్రియదర్శి, అభినవ్‌ గోమటం కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కథా, కమామిషు ఏంటి.? అనేది తెలియాలంటే పూర్తి వివరాలు వచ్చే వరకూ ఆగాల్సిందే. అందరూ చాలా క్యాజువల్‌గా ఫేస్‌ చేస్తున్న బిగ్‌ ప్రాబ్లెమ్‌ 'నో పార్కింగ్‌'. ఈ నేపథ్యాన్ని మెయిన్‌ కాన్సెప్ట్‌గా తీసుకుని రూపొందిస్తున్న ఈ సినిమాకి దర్శన్‌ దర్శత్వం వహిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS