నైజాం ఏరియాలో తనదైన ముద్ర వేసేశాడు విజయ్ దేవరకొండ. ఇక ఇక్కడ ఆయన్ని పట్టుకోవడం ఎవ్వరి తరం కాకపోతోంది. ఆల్రెడీ 19 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు.
మొత్తంగా 60 కోట్ల షేర్ పైన వసూలు చేసింది ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన 'గీత గోవిందం'. ఒక్క నైజాంలోనే 19 కోట్లు వసూలు చేసింది. ఇంకా జోరు తగ్గలేదు. 20 కోట్ల క్లబ్‌లో చేరిపోవడం దాదాపు ఖాయమే. అ లెక్కలతో స్టార్ హీరోల సరసన చేరిపోయాడు విజయ్ దేవరకొండ నైజాంలో. నైజాం మాత్రమే కాదు, అన్ని ఏరియాల్లోనూ దుమ్ము దులిపేశాడు. నైజాం నవాబ్‌గా ఇప్పుడు విజయ్ దేవరకొండని పిలుస్తున్నారంతా.
ఇక తర్వాత రాబోయే 'నోటా' చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ హీరోల సినిమాల లెక్కల్లో ఈ సినిమా వసూళ్లపై ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్ మహేష్ నటించిన 'భరత్ అనే నేను' చిత్రంతో పోల్చుతూ సోషల్ మీడియాలో ఫుల్‌గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. మహేష్‌బాబులాగే విజయ్ దేవరకొండ కూడా 'నోటా'లో ముఖ్యమంత్రి పాత్ర పోషించాడా? అనే విషయంలో పక్కా క్లారిటీ లేదు కానీ, ట్రైలర్‌లో రాజకీయనాయకుడు అనే మాట మాత్రం కీలకంగా వినిపిస్తోంది. అలాగే ముఖ్యమంత్రి అనే పేరు కూడా వినిపిస్తోంది.
అయితే ఆ ముఖ్యమంత్రి విజయ్‌దేవరకొండనా? లేక ఇతర కీలక పాత్రధారులు సత్యరాజ్, నాజర్‌లలో ఎవరైనానా? అనేది సస్పెన్స్‌గా ఉంది. ఈ సినిమాలో ముద్దుగుమ్మ మెహ్రీన్, విజయ్‌కి జోడీగా నటిస్తోంది. దసరాకి 'నోటా' ప్రేక్షకుల ముందుకు రానుంది.