చాట‌గాడు అలా పుట్టాడు!

By Gowthami - October 01, 2020 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

ఎంద చాట‌.. కాట్ర‌వ‌ల్లీ.. అంటూ విచిత్ర‌మైన భాష‌లో మాట్లాడుతుంటాడు అలీ. ఈ ప‌ద ప్ర‌యోగాలు తొలి సారి చూసింది `రాజేంద్రుడు గ‌జేంద్రుడు` సినిమాలోనే. అందులో అలీ ఊత‌ప‌దం `చాట‌..`. అప్ప‌టి నుంచీ.. తెలుగులో అదో మాట‌గా చ‌లామ‌ణీ అయిపోతోంది. అస‌లు ఈ చాట అనే ప‌దం ఎలా పుట్టింది? ఎలా వ‌చ్చింది? రూప‌క‌ర్త ఎవ‌రు? ఈ విష‌యాల్ని ఇటీవ‌ల ఎస్వీ కృష్ణారెడ్డి ఓ ఇంట‌ర్వ్యూలో పంచుకున్నారు.

 

రాజేంద్రుడు గ‌జేంద్రుడు సినిమా ప‌ట్టాలెక్కే స‌మ‌యంలో - ర‌చ‌యిత దివాక‌ర్ బాబు అలీని వెంట‌బెట్టుకుని కృష్ణారెడ్డిని క‌లిశారు. ``అలీ అని మంచి న‌టుడు. త‌న‌లో చాలా ప్ర‌తిభ ఉంది. విచిత్ర‌మైన భాష మాట్లాడ‌తాడు. అస‌లు ఆ భాషేంటో కూడా అర్థం కాదు. కానీ విన‌డానికి బాగుంటుంది`` అని ప‌రిచ‌యం చేశార్ట‌. అప్పుడే అలీ.. `ఎంత చాట‌.` అంటూ చాట భాష మాట్లాడేస‌రికి న‌వ్వు ఆపుకోలేక‌పోయార్ట‌. వెంట‌నే త‌న సినిమాలో ఛాన్స్ ఇచ్చేశారు.

 

ఆ సినిమాలో బ్ర‌హ్మానందం - అలీ మ‌ధ్య ఓ సీన్ ఉంటుంది. అలీ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక‌, బ్ర‌హ్మానందం జుత్తు పీక్కునే సీన్ అది. ఆరోజు అలీ సెట్‌కి వెళ్లిన‌ప్పుడు సీన్ పేప‌ర్ ఏమీ ఇవ్వ‌లేద‌ట‌. ``నీకు డైలాగులు ఏం రాయ‌లేదు. నీకు వ‌చ్చిన భాష‌లో మాట్లాడేయ్.. చాలు..`` అన్నార్ట‌. ఇక అలీ రెచ్చిపోయాడు. ఆ సీన్ చేస్తున్న‌ప్పుడు సెట్లో అంద‌రూ న‌వ్వుతూనే ఉన్నార్ట‌. ఏమాత్రం రిహార్స‌ల్స్ లేకుండా, సింగిల్ టేక్ లో తీసిన స‌న్నివేశం అది. బాగా పండింది. అలీకి అక్క‌డి నుంచి అవ‌కాశాలు వ‌రుస క‌ట్టాయి.

 

ఓరోజు.. అలీ ఎక్క‌డికో వెళ్తే... ఓ చిన్న‌మ్మాయి.. `అమ్మా.. చాట‌గాడు అడుగో` అంటూ అలీని త‌న అమ్మ‌కు చూపించింద‌ట‌. అప్ప‌టి నుంచీ.. అలీ చాట గాడు అయిపోయాడు. ఇంత‌కీ చాట అంటే ఏమిటో అలీకీ తెలీదు.. ఎస్వీ కృష్ణారెడ్డికీ తెలీదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS