వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలకృష్ణ మాటలు వివాదం రేపిన సంగతి తెలిసిందే. ‘నాన్న గారి’ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అక్కడితో ఆగకుండా ఎస్వి రంగారావు, అక్కినేని తొక్కనేని అని క్యాజువల్ గా మాట్లడేశారు. ఈ మాటలు కాస్త సోషల్ మీడియాలో వివాదానికి దారితీశాయి. కాగా ఈ వివాదంపై ఎస్వీ రంగా రావు గారి మనవలు స్పందించారు
‘’ఎస్వీ రంగారావు గారి కుటుంబ సభ్యులుగా, మనవలుగా మేము ఒకే విషయం చెప్పాలని అనుకుంటున్నాం. మాకు, బాలకృష్ణ గారికి చాలా మంచి అనుబంధం వుంది. మేము ఒక కుటుంబంగా వుంటాం. ఆయన మాట్లాడినది తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి చాలా జనరల్ గా చెప్పారు. ఈ విషయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయొద్దు.’’ అని చెప్పుకొచ్చారు ఎస్వీ రంగారావు మనవళ్లు.