రెండో కార్తికేయలో స్వాతి పాత్ర అదేనట.!

మరిన్ని వార్తలు

‘కార్తికేయ’ సినిమాలో కలర్స్‌ స్వాతి జూనియర్‌ డాక్టర్‌ పాత్రలో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే. లేటెస్ట్‌గా ఈ సినిమా సీక్వెల్‌కి రంగం సిద్ధమైన సంగతీ తెలిసిందే. ఆల్రెడీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా స్టార్ట్‌ అయిన ఈ సినిమాని త్వరలో సెట్స్‌ మీదికి తీసుకెళ్లనున్నారు. ఇదిలా ఉంటే, మొదటి పార్ట్‌లో నటించిన కలర్స్‌ స్వాతి అదే పాత్రలో ఈ సినిమాలోనూ కనిపించనుందట. అయితే, స్వాతిది మెయిన్‌ లీడ్‌ హీరోయిన్‌ పాత్ర కాదు. ‘కార్తికేయ’ సినిమా తర్వాత స్వాతి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైపోయింది. మళ్లీ ‘కార్తికేయ 2’ సినిమాతోనే ఆమె రీ ఎంట్రీ ఇస్తోంది. కాస్త తక్కువ నిడివి ఉన్న పాత్రే అయినా, ఆమె పాత్రకు చాలా ఇంపార్టెన్స్‌ ఉంటుందట.

 

ఇకపోతే, ఈ సినిమాలో మరో హీరోయిన్‌కీ చోటుంది. ఆ పాత్ర కోసం అనుపమా పరమేశ్వరన్‌ పేరు వినిపించింది. కానీ, ఆమె పేరు ఇంకా కన్‌ఫామ్‌ కాలేదనీ, ఆ ప్లేస్‌ కోసం మరో కొత్తమ్మాయి పేరు పరిశీలిస్తున్నారనీ తెలుస్తోంది. త్వరలోనే ఆ హీరోయిన్‌ ఎవరో ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ ద్వారా అందుతోన్న సమాచారం. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని నిఖిల్‌ చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నాడు. ఈ సినిమా కోసం ఏ సినిమాకీ కష్టపడనంతగా కష్టపడుతున్నాడట. ఆ కష్టమంతా స్క్రీన్‌పై కనిపిస్తుందనీ అంటున్నాడు. నిఖిల్ సినిమా ముచ్చట ఇలా ఉంటే, మరోవైపు ఏప్రిల్‌లో నిఖిల్‌ వివాహానికి ముహూర్తం ఫిక్స్‌ అయిన సంగతి తెలిసిందే. భీమవరానికి చెందిన డాక్టర్‌ పల్లవి వర్మను నిఖిల్‌ పెళ్లాడబోతున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS