మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ తొలిసారి నిర్మాతగా రూపొందిన చిత్రం 'ఖైదీ నెం 150'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇదే ఇన్సిపిరేషన్‌తో సొంత బ్యానర్‌లో రెండో సినిమాని కూడా తన తండ్రి చిరంజీవితోనే రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తొలి సినిమా బడ్జెట్ అంతంత మాత్రమే అయినా, రెండో సినిమా 'సైరా నరసింహారెడ్డి'కి అలా కాదు. ఇది అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం.
సో బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదట. యాక్షన్ ఘట్టాలకే కోట్లలో ఖర్చు పెడుతున్నారట. దాదాపు 200 కోట్లు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. హైద్రాబాద్ శివార్లలో ప్రస్తుతం జరుగుతున్న యాక్షన్ ఘట్టాల కోసం దాదాపు 50 లక్షల పైనే ఖర్చు పెడుతున్నారనీ తెలుస్తోంది. ఓ పక్క హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న రామ్‌చరణ్ మరోవైపు తండ్రి నటిస్తున్న 'సైరా' నిర్మాణ బాధ్యతల్ని కూడా దగ్గరుండి నిర్వరిస్తున్నాడు.
బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా, క్వాలిటీతో కూడిన నిర్మాణం ఉండేలా చూసుకుంటున్నాడు చరణ్. ఇక అంతా మాట్లాడుకునేది చిరంజీవి ఎనర్జీ గురించే. ఆ మాట ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. వయసుకు మించిన సాహసాలు ఈ చిత్రంలో చేస్తున్నారు చిరంజీవి. ఆరు పదుల వయసులో అసాధ్యమైన యుద్ధ సన్నివేశాలను ఎంతో సునాయాసంగా చేసేస్తున్నారట.
ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ల ఆధ్వర్యంలో ఈ భారీ స్టంట్లు చిత్రీకరణ జరుగుతోంది. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషా నటీనటులు ఈ చిత్రంలో కీల క పాత్రలు పోషిస్తున్నారు. సౌత్ క్వీన్ నయనతార, మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.