సైరా రికార్డుల వేట మొదలైంది. అక్టోబరు 2 తరవాత బాక్సాఫీసు దగ్గర ఎన్ని రికార్డులు బద్దలు అవుతాయో తెలీదు గానీ, ఇప్పుడైతే డిజిటల్, శాటిలైట్ రికార్డు ఎగిరిపోయింది. సైరా డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఏకంగా 125 కోట్లకు అమ్ముడయ్యాయి. సౌత్ ఇండియా సినిమాల్లో ఇదే రికార్డు. బాహుబలి, సాహో రికార్డుల్ని సైతం సైరా అధిగమించి కొత్త రికార్డు నెలకొల్పింది. పాన్ ఇండియా ఇమేజ్‌తో ఈ సినిమా విడుదల అవుతోంది.
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో డబ్ చేశారు. నాలుగు చోట్లా డిజిటల్, శాటిలైట్ మార్కెట్ ఉంది. అందుకే నాలుగు భాషల్లోనూ నెట్ వర్క్ ఉండడంతో జీటీవీ సైరా హక్కుల్ని ఇంత పెద్ద మొత్తం వెచ్చించి కొనుగోలు చేయగలిగింది. అక్టోబరు 2న సైరా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బిజినెస్‌పరంగా సైరా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలయ్యాక... ఇంకెన్ని కొత్త రికార్డులు సైరా ఖాతాలో చేరతాయో చూడాలి.