సాహో కోసం శ్ర‌ద్దాకు ఎంతిచ్చారు?

మరిన్ని వార్తలు

ద‌క్షిణాదిన అత్య‌ధిక బ‌డ్జెట్‌తో రూపొందిచ‌న చిత్రాల‌లో సాహో ఒక‌టి. దాదాపు 250 కోట్ల బ‌డ్జెట్‌తో త‌యారైన సినిమా ఇది. ప్ర‌భాస్‌కి 25 కోట్ల‌కు పైగానే పారితోషికం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. పైగా ఈ సినిమా నిర్మాణంలోనూ ప్ర‌భాస్ భాగ‌స్వామిగా ఉన్న‌ట్టు స‌మాచారం. ప్ర‌భాస్ త‌ర‌వాత అత్య‌ధిక పారితోషికం అందుకున్న‌ది క‌థానాయిక శ్ర‌ద్దా క‌పూర్‌. బాలీవుడ్ నుంచి ఈ భామ‌ని దిగుమ‌తి చేసుకున్నారు.

 

తెలుగులో తాను చేసిన తొలి సినిమా ఇది. శ్ర‌ద్ద‌కి దాదాపు 7 కోట్ల పారితోషికం ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రిగింది. బాలీవుడ్‌లో శ్ర‌ద్దాక‌పూర్ పారితోషికం 2 నుంచి 4 కోట్ల వ‌ర‌కూ ఉంది. ద‌క్షిణాదికి రావాలంటే అందుకు రెట్టింపు ఇవ్వాల్సిందేన‌ని శ్ర‌ద్దా ప‌ట్టుప‌ట్టింద‌ని, అందుకే 7 కోట్ల పారితోషికం ఇచ్చార‌ని చెప్పుకున్నారు. అయితే అవ‌న్నీ గాసిప్పులేన‌ట‌. ఈ సినిమా కోసం శ్ర‌ద్దాక‌పూర్‌కి ఇచ్చింది 3 కోట్లేన‌ని తెలుస్తోంది.

 

ఈ ర‌కంగా చూసినా, టాలీవుడ్‌లో అత్య‌ధిక పారితోషికం అందుకున్న క‌థానాయిక‌గా శ్ర‌ద్దా నిలవ‌డం ఖాయం. మ‌రి.. ప్ర‌భాస్‌కి ఎంతిచ్చారో కూడా తెలిస్తే ఏ ప‌నైపోతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS