'జిగేల్‌ రాణి'తో 'సూపర్‌' సెంటిమెంట్‌ వర్కవుట్‌ అయ్యేనా?

మరిన్ని వార్తలు

'సరిలేరు నీకెవ్వరు' సినిమాని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ ప్రాజెక్ట్‌ని ఎలాగైనా సక్సెస్‌ చేయాలని రాత్రీ పగలూ కష్టపడుతున్నాడు. ఎన్ని రకాల వన్నెలు అద్దాలో అన్ని రకాల వన్నెల్నీ తీర్చి దిద్దుతున్నాడు. తాజాగా ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ కోసం మిల్కీ బ్యూటీ తమన్నా పేరు వినిపించింది. కానీ, అందులో నిజం లేదని తేలిపోయింది.

 

ఆ ప్లేస్‌ని జిగేల్‌ రాణితో రీప్లేస్‌ చేయాలనుకుంటోందట అనిల్‌ అండ్‌ టీమ్‌. పూజా హెగ్దే తొలి సారి స్పెషల్‌ సాంగ్‌ చేసిన 'రంగస్థలం' సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. అదే సెంటిమెంట్‌ ఫాలో అవుతూ ఈ సినిమాలో పూజా హెగ్దేని ప్రిఫర్‌ చేస్తున్నారట. మహేష్‌బాబు కూడా పూజాకే ఓటేయడంతో, పూజా హెగ్దే పేరు గట్టిగా వినిపిస్తోంది. 'మహర్షి'లో పూజా, మహేష్‌ జంట ఆకట్టుకుంది. ఆ సినిమాతో వీరిద్దరి మధ్యా రీల్‌ ఫ్రెండ్‌షిప్పే కాకుండా, రియల్‌ ఫ్రెండ్‌షిప్‌ కూడా నెలకొంది. ఆ ఫ్రెండ్‌షిప్‌తోనే మహేష్‌ బాబు, పూజా హెగ్దేని ఈ సినిమా కోసం ఆడిగారట.

 

మహేష్‌ అడిగితే పూజా ఎందుకు కాదంటుంది చెప్పండి. కాదనే ఛాన్సే లేదు. సో జిగేల్‌ రాణి మరోసారి మెరుపులు మెరిపించనుందన్న మాట. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌లో జిగేల్‌రాణి జిల్‌ జిల్‌ మంటూ మరోసారి మాస్‌ స్టెప్పులేసేయడానికి సిద్ధమైనట్లేనేమో. ఈ సినిమాలో రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. దిల్‌రాజుతో కలిసి మహేష్‌బాబు నిర్మాణ భాగస్వామ్యం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ నటి విజయ శాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. పక్కా ఎంటర్‌టైనింగ్‌ కాన్సెప్ట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించేలా ఈ సినిమా రూపొందుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS