'సైరా' అక్కడ షూటింగ్‌ అదిరిపోయిందట

By iQlikMovies - October 23, 2018 - 15:50 PM IST

మరిన్ని వార్తలు

'సైరా నరసింహారెడ్డి' సినిమా షూటింగ్‌కి సంబంధించి అతి కీలకమైన షెడ్యూలర్‌ పూర్తయ్యింది. జార్జియాలో భారీ స్థాయిలో ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ని దర్శకుడు సురేందర్‌రెడ్డి కంప్లీట్‌ చేశాడు. 

సోషల్‌ మీడియాలో ఈ మేరకు కొన్ని ఫొటోలు దర్శనమిస్తున్నాయి. మండుతున్న ఎండల నడుమ, ఆ షూటింగ్‌ ఎపిసోడ్‌ని ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నారట. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెల్సిందే. స్వాతంత్య్ర పోరాటంలో తెలుగోడి పౌరుషం, సత్తా ఈ సినిమా ద్వారా చాటి చెప్పబోతున్నారు. ఆనాటి ఆ పరిస్థితులకు తగ్గట్టుగా లొకేషన్ల ఎంపిక సినిమా యూనిట్‌కి కత్తి మీద సాముగా మారింది. 

ఈ నేపథ్యంలో జార్జియాలో అత్యద్భుతమైన లొకేషన్లను కనుగొన్నారు. అక్కడే షూటింగ్‌ పూర్తి చేశారు. చిరంజీవిపై ఈ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చిత్రీకరించారు. గుర్రపు స్వారీతో కూడిన ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ తెలుగు సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మారబోతోందట. రామ్‌చరణ్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెల్సిందే. 

చిరంజీవి సరసన నయనతార ఈ సినిమాలో కథానాయికగా నటించబోతోంది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, తమిళ నటుడు విజయ్‌ సేతుపతి, కన్నడ నటుడు సుదీప్‌ ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. 2019లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS