సినిమా మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని `సైరా` సినిమా మరోసారి గుర్తు చేసింది. బడ్జెట్‌ని ముందే కంట్రోల్ చేసుకోవడం, స్క్రిప్టు దశలోనే `పరిహరించదగిన` విషయాల్ని గుర్తించి, వాటిని పక్కన పెట్టడం దర్శక నిర్మాతలు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. దీన్ని అటు చరణ్, ఇటు సురేందర్ రెడ్డి విస్మరించారు. దాంతో ఏకంగా 8 కోట్లు వృధాగా పోయాయి. విషయానికొస్తే.. `సైరా` కోసం చిరంజీవి - తమన్నాలపై ఓ గీతాన్ని తెరకెక్కించారు. అదో డ్యూయెట్.
ఈ పాట కోసం దాదాపు 8 కోట్లు ఖర్చు చేశారు. ఆ పాటని చివరి నిమిషాల్లో కత్తెరించేశారు. దానికి కారణం.. ఇందులో చిరు కొన్ని మాస్ స్టెప్పులు వేయడమే నట. ఇదో పోరాట యోధుడి కథ. ఈ కథలో ఇలాంటి మాస్ స్టెప్పులు జీర్ణించుకోలేం. అందుకే.. ఈ పాటని కత్తిరించారు. కత్తిరించడం మంచిదే అయినా, ఈ పాట ఈ సినిమాకి అనవసరం అని ముందే గుర్తించకపోవడం నేరం... ఘోరం. దాని వల్ల 8 కోట్లు నష్టపోవాల్సివచ్చింది. కనీసం అమేజాన్ లో వచ్చినప్పుడైనా ఈ పాటని అతికిస్తారేమో చూడాలి.