విశాల్‌ 'యాక్షన్‌'లో తమన్నా ఎక్కడా.?

మరిన్ని వార్తలు

'సైరా' తర్వాత మిల్కీబ్యూటీ తమన్నా రేంజ్‌ బాగా మారిపోయింది. సో తమన్నా నుండి తర్వాత రాబోయే సినిమాల విషయంలో చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగిపోయాయి. ప్రస్తుతం తమన్నా తమిళంలో 'యాక్షన్‌' చిత్రంలో నటిస్తోంది. సుందర్‌.సి దర్శకత్వంలో విశాల్‌ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ట్రైలర్‌ని దీపావళి సందర్భంగా విడుదల చేశారు. పక్కా యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ని విజువల్‌ వండర్‌గా కట్‌ చేశారు.

 

విజువల్స్‌ చాలా రిచ్‌గా కనిపిస్తున్నాయి. సూపర్‌ మ్యాన్‌లా డిజైన్‌ చేశారు హీరో క్యారెక్టర్‌ని. ఎత్తైన బిల్డింగ్స్‌ మీద నుండి దూకడం, భారీ యాక్షన్‌ సన్నివేశాల్లో పాల్గొనడం.. వంటివి హీరో క్యారెక్టర్‌ని చాలా ఎలివేట్‌ చేస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా నటిస్తోంది. గతంలో విడుదల చేసిన తమన్నా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని చాలా ఎట్రాక్టివ్‌గా ఆసక్తికరంగా డిజైన్‌ చేశారు. సూపర్‌ విమెన్‌లా చూపించారు. అయితే, లేటెస్ట్‌గా విడుదలైన ట్రైలర్‌లో తమన్నా క్యారెక్టర్‌ చాలా తేలిపోయింది.

ఆల్రెడీ విడుదల చేసిన పాత స్టిల్స్‌ తప్ప కొత్తగా చూపించిందేమీ లేదు. ఒకే ఒక్క స్టిల్‌లో ఫిట్‌గా విశాల్‌ పక్కన నిలబడి ఉన్న తమన్నా కనిపించిందంతే. మిగిలిన గ్లామర్‌ లుక్స్‌ అన్నీ, గతంలో విడుదల చేసినవే కావడంతో, తమన్నా ఫ్యాన్స్‌ డిజప్పాయింట్‌ అవుతున్నారు. ఇంతకీ ఇది తమిళ వెర్షన్‌ ట్రైలర్‌ మాత్రమే. ఒకవేళ తెలుగు వెర్షన్‌కొచ్చేసరికి తమన్నా పాత్రను ట్రైలర్‌లో ఇంకాస్త యాడ్‌ చేస్తారేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS