ఇంతవరకూ రికార్డులంటే 'బాహుబలి'వే. సినిమా రికార్డుల్ని బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అన్నట్లుగా కాలిక్యులేట్ చేస్తున్నారు ఇప్పుడు. అయితే, 'సైరా'తో ఆ కాలిక్యులేషన్ స్టేట్‌మెంట్‌కి చెల్లు చీటీ పడేలా ఉంది. ఇప్పటికే 'సైరా' ప్రీ రిలీజ్ బిజినెస్ ఆకాశాన్నంటేసింది. ఇక అతి ముఖ్యమైన మరో 'బాహుబలి' రికార్డును 'సైరా' క్రాస్ చేసేసింది. స్వయంగా ఈ విషయాన్ని 'బాహుబలి' దర్శకుడు రాజమౌళి కన్‌ఫామ్ చేయడం విశేషం. తెలుగు సినిమా విజువల్ వండర్‌గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది 'బాహుబలి' సినిమా.
అయితే 'బాహుబలి'కి వాడిన టోటల్ విజువల్ షాట్స్ 2300 కాగా, 'సైరా' కోసం 3800 విజువల్ షాట్స్‌ని వాడారట. ఇది నిజంగా అద్భుతం అని దర్శక ధీరుడు జక్కన్న చెప్పారు. అంతేకాదు, అన్ని విజువల్ షాట్స్‌ని వాడడమంటే దర్శకుడికి అసలు సిసలు సవాల్ అనీ ఓ దర్శకుడిగా, విజువల్ ఎఫెక్ట్స్‌ని ఆ రేంజ్‌లో వాడిన అనుభవంతో అది ఎంత కష్టమైన పనో నేను చెప్పగలను.
అందుకే 'సైరా' నిజంగా గొప్ప విజువల్ వండర్ అవుతుంది. ఇలాంటి గొప్ప సినిమాని టేకప్ చేసే అదృష్టం దక్కిన సురేందర్ రెడ్డిని అభినందిస్తున్నాను అంటూ 'సైరా' ప్రమోషన్స్‌లో రాజమౌళి వివరించారు. తుది మెరుగులు దిద్దుకుని ఇక ధియేటర్‌లో సందడి చేసేందుకు సిద్ధమవుతోన్న 'సైరా' ఖాతాలో ఇలాంటి మరింకెన్ని రికార్డులు యాడ్ అవుతాయో చూడాలిక. అక్టోబర్ 2న 'సైరా' వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది.