అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న 'సైరా' నుండి టీజర్, ట్రైలర్, ప్రోమో సాంగ్స్ రిలీజ్ చేసి, సినిమాపై హైప్ పెరిగేలా చేశారు ఇంతవరకూ. వీటితో పాటు, తాజాగా ఇంకో ట్రైలర్ కూడా విడుదల చేశారు. యాక్షన్ ఓరియెంటెడ్ ట్రైలర్ అని ఈ ట్రైలర్‌ని ప్రమోట్ చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే, 'ఇండియాని ఈజీగా దోచేయొచ్చు. బలగాలతో వెళ్లిన మన ఓడలు వారి బంగారంతో తిరిగి రావాలి.. అని బ్రిటీష్ అధికారి చెబుతున్న డైలాగుకు.. అది మనది, మన ఆత్మ గౌరవం.
గడ్డిపరక కూడా గడ్డ దాటకూడదు.. అని చిరంజీవి ఇచ్చే కౌంటర్ డైలాగ్ అదిరింది. 'చంపడమో, చావడమో ముఖ్యం కాదు, గెలవడం ముఖ్యం..' అని అమితాబ్ బచ్చన్ చెప్పే డైలాగ్ ట్రైలర్‌కి హైలైట్‌గా నిలిచింది. 'ఈ గడ్డ మీద పుట్టిన ప్రతీ ప్రాణిదీ ఒకే లక్ష్యం.. స్వాతంత్య్రం.. స్వాతంత్య్రం.'. అంటూ ఉరి కంబమెక్కుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్ ముగిసింది.
ఇంతకు ముందు విడుదలైన ప్రచార చిత్రాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉంది ఈ ట్రైలర్. బ్యాటిల్ ఫీల్డ్‌తో పాటు, క్లైమాక్స్‌లో ఉరి తీసే సన్నివేశంలో నరసింహారెడ్డి నోటి వెంట వచ్చే చివరి మాటగా ఆ ఆఖరి డైలాగ్‌ని ఈ ట్రైలర్‌లో చూపించారు. చిరంజీవి, అమితాబ్‌తో పాటు, ఒక్క షాట్‌లో విజయ్‌సేతుపతి కనిపించాడంతే. మిగిలిన వారికి ఈ ట్రైలర్‌లో చోటు దక్కలేదు. ఈ ట్రైలర్ కోసం కూడా విజువల్‌ని చాలా గ్రాండ్‌గా కట్ చేశారు. ఈ ట్రైలర్‌తో మరింత ఉత్కంఠ పెంచేశారు అభిమానుల్లో. మరో ఆరు రోజుల్లో 'సైరా' ప్రేక్షకుల ముందుకు రానుంది.