'సైరా' ట్రైలర్‌ పండగకు కౌంట్‌డౌన్‌ స్టార్ట్స్‌!

మరిన్ని వార్తలు

తెలుగు సినిమా ఖ్యాతిని మరో మెట్టు ఎక్కించే సినిమా 'సైరా' అని అందరూ భావిస్తున్నారు. ఈ సినిమా ధియేటర్స్‌లో సందడి చేసేందుకు ఇంకెంతో సమయం లేదు. కొన్ని రోజుల వ్యవధి మాత్రమే ఉంది. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్‌ 2న 'సైరా'ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఘనంగా ఏర్పాటు చేయనున్నారు. మొదట్లో కర్నూల్‌లో ఈ ఫంక్షన్‌ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఈ వేడుకను జరిపేందుకు హైద్రాబాద్‌ ఎల్బీ స్టేడియం అదృష్టం అందిపుచ్చుకుంది.

 

ఈ నెల 18న ఎల్బీ స్టేడియంలో 'సైరా' ప్రీ రిలీజ్‌ వేడుకకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కి బాలీవుడ్‌ బిగ్‌బీతో సహా సౌత్‌ నుండి పలువురు ప్రముఖ నటీనటులు టాలీవుడ్‌ ప్రముఖులు హాజరు కానున్నారని సమాచారం. అలాగే తెలంగాణా వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారనీ తెలుస్తోంది. ఈ సినిమాకి నిర్మాత అయిన రామ్‌చరణ్‌, కేటీఆర్‌కి మంచి స్నేహితుడు. గతంలో చరణ్‌ నటించిన 'వినయ విధేయ రామ' చిత్రానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

 

ఇప్పుడు చిరంజీవి 'సైరా'కి కూడా ఆయనకు ఆహ్వానం అందిందట కానీ, అనివార్య కారణాల వల్ల ఆయన ఈవెంట్‌కి రాలేకపోతున్నారని చిత్రబృందం వెల్లడించింది. టాలీవుడ్‌ నుండి జక్కన్న రాజమౌళి, వినాయక్‌, కొరటాల శివ తదితరులు హాజరు కానున్నారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది. అదే రోజు 'సైరా' ట్రైలర్‌ విడుదల కానుందని చిత్ర యూనిట్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. అభిమానులకు ఇది అసలు సిసలు పండగ రోజు. ఈ పండగను ఆస్వాదించేందుకు కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ చేసేశారు మెగా ఫ్యాన్స్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS