కరోనా మరోసారి చిత్ర పరిశ్రమపై పడగ విప్పింది. కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా వెళుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్ లో అమలౌతున్నాయి. లాక్ డౌన్ లో బాగంగా ముందుగా థియేటర్లు మూసేస్తున్నారు. దీంతో సినిమా రంగం పరిస్థితి అగ్యమగోచరంగా మారింది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు చిక్కుల్లో పడ్డాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ వాయిదా పడింది. ప్రభాస్ రాధే శ్యామ్ కూడా వాయిదా అని వార్తలు వచ్చాయి. అయితే నిర్మాతలు వాయిదా వుండదని ప్రకటించారు. కానీ ఇక్కడ నిర్మాతల విడుదల కోసం మూడు ఆప్షన్లు చూస్తున్నారు. థియేటర్ రిలీజ్, ఓటీటీలో పే ఫర్ వ్యూ మోడల్, నేరుగా ఓటీటీ రిలీజ్. ఇందులో ఓటీటీలో పే ఫర్ వ్యూ మోడల్ సక్సెస్ కాలేదు. ఈ ఆప్షన్ ని సెలక్ట్ చేసుకొని అవకాశం తక్కువ.
ఇక థియేటర్, ఓటీటీ పైన నిర్మాతలు చర్చలు జరుగుపుతున్నారు. ఇప్పటికే చాలా ఓటీటీ సంస్థలు యువీ క్రియేషన్స్, టీసిరీస్ సంస్థలని సంప్రదించాయి. టీసీరిస్ ఓటీటీకే మొగ్గు చూపుతుంది. ఈ విషయంలో యువీ క్రియేషన్స్ పై టీసిరీస్ ఒత్తిడి కూడా వుంది. అయితే యువీ క్రియేషన్స్ మాత్రం థియేటర్ వైపు చూస్తుంది. కారణం.. రాధే శ్యామ్ చాలా పెద్ద కాన్వాస్ వున్న సినిమా. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎలాంటి ఆంక్షలు లేవు. ఏపీ, తెలంగాణ బయ్యర్లు సినిమాని థియేటర్ లో రిలీజ్ చేయాలనే కోరుతున్నారు. టీసిరిస్ మాత్రం.. పరిస్థితి ఎలా వుంటుందో చెప్పలేమని థియేటర్ రిలీజ్ ప్రస్తుత పరిస్థితిలో అంత సేఫ్ గేమ్ కాదని అభిప్రాయపడుతుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ వీకెండ్ లో నిర్మాతల నుంచి ఒక ప్రకటన వచ్చే ఛాన్స్ వుంది.