తాప్సీ మహా ముదురు

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ తాప్సీ రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'ఝుమ్మంది నాదం' సినిమాతో క్యూట్‌గా బబ్లీగా ఎంట్రీ ఇచ్చింది. గ్లామరస్‌ పాత్రలకే తెలుగులో పరిమితమైంది ఈ ముద్దుగుమ్మ. క్యూట్‌ క్యూట్‌గా మాట్లాడే ఈ భామకు తెలుగులో తన టాలెంట్‌ చూపించే అవకాశం ఓ పరిధి వరకే ఆగిపోయింది. కానీ బాలీవుడ్‌కెళ్లాక తాప్సీ చాలా మారపోయింది. ఏంటి ఇది తాప్సీనా? తాప్సీలో ఏంటి ఈ మార్పు అనేంతలా ఆమె మారిపోయింది. వాస్తవానికి బాలీవుడ్‌ తనలోని టాలెంట్‌ని బయటికి తెచ్చింది. కానీ తనలో ఆల్రెడీ ఆ టాలెంట్‌ దాగుందంటోంది. అంతేకాదు ఈ మధ్య తాప్సీ మహిళల భద్రత గురించి, మహిళలపై జరుగుతున్న అరాచకాలు, అఘాయిత్యాల గురించి గట్టిగా స్పందిస్తోంది. బహుశా తాప్సీలో ఈ ఛేంజ్‌ లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ చేయడం వల్లే వచ్చింది కాబోలు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన 'నామ్‌ షబానా' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసమే తాప్సీ ఇలా మాట్లాడుతోంది కాబోలు. ఈ సినిమాని తెలుగులో 'నేనే షబానా' టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో తాప్సీ నటనకి తెలుగు ప్రేక్షకులంతా షాక్‌ అవుతారు. ఎందుకంటే ఇంతవరకూ తాప్సీ అంటే జస్ట్‌ గ్లామర్‌ డాళ్‌ మాత్రమే. కానీ ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది ఆమెలో దాగున్న టాలెంట్‌ ఏంటో. ఈ సినిమాలో తాప్సీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ వావ్‌ అనిపించేలా ఉండబోతున్నాయని ట్రైలర్‌ చూస్తేనే తెలుస్తోంది. ఏది ఏమైనా లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌లో నటిస్తుండడం వల్ల తాప్సీలో చాలా మెచ్యూరిటీ వచ్చింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS