జ‌నాలే ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నార్ట‌!

By Gowthami - May 12, 2020 - 17:20 PM IST

మరిన్ని వార్తలు

తాప్సి రూటే సెప‌రేటు. కోరి మ‌రీ కాంట్ర‌వ‌ర్సీలు తెచ్చుకుంటుంది. ఏదైనా స‌రే ముక్కు సూటిగా మాట్లాడేస్తుంటుంది. బాలీవుడ్ వెళ్లి, అక్క‌డ రెండు మూడు హిట్లు అందుకున్న‌ప్ప‌టి నుంచీ తాప్సి.. ఎప్ప‌టిక‌ప్పుడు ఇలా రెచ్చిపోతూనే ఉంది. తాజాగా తాప్సి ఇంకొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది.

 

`బాయ్స్ లాక‌ర్ రూమ్ ` వాట్స‌ప్ చాటింగ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు తావిచ్చిన సంగ‌తి తెలిసిందే. దిల్లీ విద్యార్థుల వాట్స‌ప్ గ్రూప్ కి పెట్టుకున్న పేరిది. అంతా ప‌దిహేనేళ్ల లోపు వాళ్లే. ఆ వాట్స‌ప్ గ్రూపులో అమ్మాయిల గురించి, వాళ్ల అంగాంగాల గురించీ, రేపుల గురించీ - చ‌ర్చించుకుంటున్నారు. ఈ చాటింగ్ లీక్ అవ్వ‌డంతో అబ్బాయిల ప్ర‌వ‌ర్త‌న‌, వాళ్ల దృష్టిలో అమ్మాయిల‌కున్న విలువ బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

 

వీటిపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. అబ్బాయిలు ఇలాక్కూడా మాట్లాడుకుంటారా? అని అంతా ఆశ్చ‌ర్య‌పోతుంటే - తాప్సి మాత్రం, అందులో ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం ఏముంది? జ‌నాలు ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నారు గానీ, నేను మాత్రం షాక్ తిన‌లేదు అంటూ ఇంకాస్త షాక్ ఇచ్చింది. అమ్మాయిల గురించి అబ్బాయిలు ఇంత విచ్చ‌ల‌విడిగా మాట్లాడుకోవ‌డం కొత్తేమీ కాదని, ఎప్ప‌టి నుంచో ఉంద‌ని, ఇప్పుడు సోష‌ల్ మీడియా వ‌ల్ల బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌ని తేల్చేసింది. అబ్బాయిల ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల కాద‌ట‌, జ‌నాలు ఇంత‌లా రియాక్ట్ అవ్వ‌డ‌మే త‌నని ఆశ్చ‌ర్యానికి గురి చేసిందంటోంది. అమ్మాయిల్ని అబ్బాయిలు చూసే విధానం మార‌నంత వ‌ర‌కూ.. ఇలాంటి ఘోర‌మైన చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉంటాయ‌ని చెప్పుకొచ్చింది తాప్సి. ఎంతైనా తాప్సి మాట‌ల్లోనూ ఎంతో కొంత నిజ‌ముంది క‌దా?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS