స్క్వాష్‌ చేతపట్టి - ఫిట్‌నెస్‌తో అదరగొట్టి

మరిన్ని వార్తలు

'ఝుమ్మంది నాదం' సినిమాతో ముద్దుగా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ తాప్సీ. టాలీవుడ్‌కి పరిచయమైన కొత్తల్లో తాప్సీ కొంచెం బొద్దుగా కనిపించేది. బాలీవుడ్‌కి వెళ్లాకా బాగా బక్క చిక్కిపోయింది. 

'బేబీ', 'నామ్‌ షబానా' చిత్రాల్లో స్లిమ్‌గా కనిపించింది తాప్సీ. అయితే అది సన్నబడడం కాదు. ఫిట్‌నెస్‌ లెవల్స్‌ని పెంచుకోవడం. ఈ క్రమంలోనే తాప్సీ బాగా సన్నబడింది. 'నామ్‌ షబానా' తదితర చిత్రాలు హీరోయిన్‌ ప్రాధాన్యత ఉన్న చిత్రాలు కావడంతో ఈ సినిమాల కోసం బాక్సింగ్‌ సహా, చాలా పోరాట విద్యల్లో ట్రైనింగ్‌ తీసుకుంది తాప్సీ. తాజాగా బాలీవుడ్‌లో ఓ సినిమా కోసం తాప్సీ హాకీ నేర్చుకుంటోందట. హాకీ నేపథ్యంలో సాగే చిత్రమిది. 

'సూర్మా' అనే టైటిల్‌తో ఈ సినిమా నిర్మితమవుతోంది. కాగా 'ముల్క్‌' అనే మరో చిత్రంలోనూ తాప్సీ నటిస్తోంది. ఈ రెండు సినిమాల్లోనూ తాప్సీ రొటీన్‌ గ్లామరస్‌ పాత్రలకు భిన్నంగా కనిపించనుంది. ఈ రెండు సినిమాలు యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌గా తెరకెక్కుతోన్న నేపథ్యంలో తన శరీరాన్ని పూర్తి ఫిట్‌గా మలచుకుంటోంది తాప్సీ. టాలీవుడ్‌లో గ్లామరస్‌ పాత్రలతో మెప్పించిన తాప్సీ, బాలీవుడ్‌కి వెళ్లాకా, అన్నీ డిఫరెంట్‌ కథాంశం ఉన్న సినిమాలనే ఎంచుకుంటోంది. దాదాపు గ్లామరస్‌ పాత్రల్ని తగ్గించేసింది. అప్పుడప్పుడూ 'జుద్వా - 2'లాంటి సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించినా, ఎక్కువగా ఇలాంటి సినిమాలనే తాప్సీ ఎంచుకుంటోంది. 

ఈ తరహా జోనర్‌ చిత్రాలకు ఫిట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రతీరోజూ తాప్సీ స్క్వాష్‌ ఆడుతుందట. మరో పక్క తెలుగులో తాప్సీ ఇటీవలే 'ఆనందోబ్రహ్మ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆది పినిశెట్టి హీరోగా ఓ సినిమాలో నటిస్తోంది అందాల భామ తాప్సీ.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS