టాలీవుడ్లో గ్లామర్ తారగా వెలుగొందిన ముద్దుగుమ్మ తాప్సీ ఇప్పుడు బాలీవుడ్లో దున్నేస్తోన్న సంగతి తెలిసిందే. అక్కడ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో దుమ్ము దులిపేస్తోంది. అయితే సినిమాల్లోకి ఎలా రావల్సి వచ్చిందన్న విషయంపై తాప్సీ తన మనసులోని కొన్ని సంగతులను అభిమానులతో పంచుకుంది.
మోడలింగ్ రంగం నుండి, సినిమాల్లోకి వచ్చిన తాప్సీ మొదట్లో పాకెట్ మనీ కోసమే మోడలింగ్ రంగాన్ని ఎంచుకుందట. సినిమాల్లోకి రావాలన్న ఆలోచన అప్పట్లో లేదట. అయితే అనుకోకుండా 'ఝుమ్మంది నాదం' సినిమాలో అవకాశం రావడం, ఆ తర్వాత వరుస అవకాశాలు.. అలా అలా తెలుగులో గ్లామర్ తారగా సెటిలైపోయానని చెప్పుకొచ్చింది. అలాగే బాలీవుడ్ అవకాశాలు కూడా అంటోంది. అయితే ఒక్కటే తేడా, ఇక్కడ గ్లామర్‌కే ప్రిఫరెన్స్ ఇస్తే, అక్కడ తనలోని టాలెంట్‌ని గుర్తించారు.
ఏది ఏమైనా మొదట్లో సినిమాలను అస్సలు సీరియస్‌గా తీసుకోలేదట తాప్సీ. కానీ ఒక్కసారి ఈ రంగంలోకి అడుగుపెట్టాక తెలిసిందట సినిమా అంటే ఏంటో. ఆ తర్వాత ఏదో ఒకటి సాధించాలన్న కసి పెరిగిందట. ఇప్పుడు వస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలతో చాలా చాలా హ్యాపీగా ఉన్నానంటోంది. అలా అని గ్లామర్ పాత్రలు నచ్చలేదా? అంటే అప్పుడూ హ్యాపీనే. ఇప్పుడూ హ్యాపీనే అంటోంది.
తాజాగా తెలుగులో 'నీవెవరో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్లో పలు చిత్రాలతో బిజీగా ఉంది అందాల తాప్సీ.