బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రంలో సీనియర్ నటి టబు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ సెట్స్‌లోకి తాజాగా టబు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా టబు పాత్ర తాలూకు టీజర్ ఒకటి చిత్ర యూనిట్ అఫీషియల్‌గా రిలీజ్ చేసింది. ఈ టీజర్లో టబు సీరియస్‌గా స్క్రిప్టు ప్రిపేర్ అవుతన్నట్లుగా కనిపించింది. లుక్స్ పరంగా చూస్తే, త్రివిక్రమ్ సినిమాలోని నదియా లుక్స్‌నే తలపిస్తోంది.
హుందాగా, స్టైలిష్ అండ్ హోమ్లీ లుక్స్‌తో ఎప్పటిలానే అందంగా కనిపిస్తోంది టబు. పింక్ కలర్ శారీ, గోల్డెన్ బ్లౌజ్‌తో, చెవులకు పెద్ద పెద్ద జుంకీలతో హాయిగా స్వీట్ స్లైల్ ఇస్తూ కనిపిస్తున్న టబు లుక్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, టబు పాత్ర ఏంటనేది రివీల్ కాలేదు. మొత్తానికి కీలక పాత్ర అని ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ 19వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్‌తో కలిసి, హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.