'విరాట పర్వం'లో టబుని రీప్లేస్‌ చేసిన 'ఆమె'!

By iQlikMovies - August 30, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

'నీది నాది ఒకే కథ' ఫేం వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'విరాటపర్వం' సినిమా ఇటీవలే సెట్స్‌ మీదికెళ్లింది. 1990 కాలం నాటి నక్సలిజం కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది ఈ సినిమా. కథ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోంది. కథలోని ప్రతీ పాత్రకూ ఇంపార్టెన్స్‌ ఉండబోతోంది. రానా హీరో కాగా, సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రియమణి కీలక పాత్ర పోషిస్తోంది.

 

కాగా, టబుని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. అయితే, వేరే కారణాలతో టబు ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకుంది. ఆ ప్లేస్‌లోకి నందితా దాస్‌ని తీసుకున్నారు. ఈమె తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు కానీ, బాలీవుడ్‌తో సహా, తమిళ, మలయాళ, బెంగాలీ, ఉర్దూ తదితర భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. నటిగానే కాకుండా, డైరెక్షన్‌ విభాగంలోనూ అనుభవం ఉంది. ఈ పాత్ర సినిమాకి చాలా కీలకం కావడంతో, సీనియర్‌ నటితోనే ఈ పాత్ర చేయించాలన్న డైరెక్టర్‌ కోరిక మేరకు, టబు తప్పుకున్నా, నందితాతో ఆ లోటు తీర్చనున్నాడు.

 

త్వరలోనే నందితా దాస్‌ సెట్స్‌లో జాయిన్‌ కానున్నారట. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో రానా పాల్గొనడం లేదు. ఆయనింకా అమెరికా టూర్‌లో బిజీగా ఉన్నాడు. అందుకే మిగిలిన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. 90ల కాలం నాటి ఎమర్జెన్సీ ఎపిసోడ్స్‌ని ఈ సినిమాలో కీలకంగా చూపించనున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS