సంక్రాంతి సీజన్ ముగిశాక.. టాలీవుడ్‌ని వరుస ఫ్లాపులు మంచెత్తాయి. గత వారం భీష్మ హిట్టుతో టాలీవుడ్ కాస్త ఊపిరి తీసుకోగలిగింది. ఈవారం హిట్ సినిమా విడుదలైంది. నాని నిర్మాతగా రూపొందించిన చిత్రమిది. విశ్వక్సేన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం శుక్రవారం వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రానికి మంచి రివ్యూలే వచ్చాయి. తొలి రోజు బాక్సాఫీసు దగ్గర 1.3 కోట్లు తెచ్చుకుంది. రెండో రోజు కూడా వసూళ్లు స్డడీగా ఉన్నాయి. తొలి మూడు రోజుల్లో కనీసం 3 కోట్లు సంపాదించింది. దాంతో.. పెట్టుబడి పూర్తిగా తిరిగొచ్చేసినట్టైంది.
థ్రిల్లర్ జోనర్ చిత్రాలు మల్టీప్లెక్స్‌లో బాగా ఆడతాయి. అయితే విశ్వక్ సేన్ వల్ల, నాని బ్రాండ్ పడడం వల్ల.. బీసీలలో కూడా టికెట్లు బాగానే తెగుతున్నాయి. క్లైమాక్స్ వీక్ అవ్వడం వల్ల.. యావరేజ్ స్థాయిలో ఆగిపోయింది గానీ, అక్కడ కూడా తనవైన మెరుపులు ఉంటే.. తప్పకుండా ఈ చిత్రం `హిట్` స్థాయికి చేరిపోయేది. ఈ సినిమాతో పాటు రెండు మూడు చిన్న చిత్రాలూ బాక్సాఫీసు ముందుకు వచ్చాయి. కానీ ఫలితం లేకుండా పోయింది. గతవారం విడుదలైన భీష్మకు ఈ వారం మరింత కలిసొచ్చింది. ఈ వీకెండ్ కూడా భీష్మ బాక్సాఫీసు దగ్గర తనదైన ముద్ర వేయగలిగింది.