బిచ్చగాడు సినిమాతో తెలుగు మార్కెట్ లో తనకంటూ ఒక మార్కెట్ తో పాటు తెలుగు ప్రేక్షకుల్లో ఒక గుర్తింపు తెచ్చుకున్న రచయిత-నటుడు-దర్శకుడు విజయ్ ఆంటోనీ.
ఈయన చిత్రాల పైన తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణని దృష్టిలో పెట్టుకుని తన ప్రతి సినిమాని తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ వారం కాశి అనే చిత్రం విడుదలైంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, దర్శకుడు తీసుకున్న పాయింట్ లో బలం ఉన్నప్పటికి అది తెర పైకి తీసుకొచ్చే క్రమంలో పట్టాలు తప్పింది.
ఇక విజయ్ నటించడమే కాకుండా ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అయితే ఆయన నటనలో పెద్దగా మార్పు లేదు అలాగే హీరోయిన్ అంజలి పాత్ర కుడా అంతంతమాత్రమే. సినిమా విడుదలకి ముందే మొదటి 7 నిమిషాలని విడుదల చేసి ఒక కొత్త ప్రయోగం చేసినా ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించలేదు. కారణం- ఈ సినిమా ఆసాంతం ప్రేక్షకులని అలరించలేకపోవడమే.
ఈ చిత్రం నిరాశపరచడం, వేరే ఏ తెలుగు సినిమా లేకపోవడంతో అందరూ మహానటి చిత్రం వైపే మొగ్గుచూపారు. ఇది ఈ వారం ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్.