ప్రతివారం లాగే ఈ వారం కూడా కొత్తగా విడుదలైన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. అందులో ప్రముఖంగా సునీల్ ఉంగరాల రాంబాబు మరియు నారా రోహిత్ కథలో రాజకుమారి.
ఇక ఈ సినిమాల విషయానికి వస్తే, రెండు చిత్రాలు మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ ని మూటకట్టుకున్నాయి. మొదట ఉంగరాల రాంబాబు గురించి మాట్లాడుకుంటే- ఈ చిత్రంలోని కథకి.. సునీల్ కి... పొత్తు కుదరలేదు అనిపిస్తుంది. దానికితోడు హీరోగా సునీల్ ని ఎందుకో అంగీకరించట్లేదు అని అనిపిస్తున్నది.
రెండవ చిత్రం అయిన కథలో రాజకుమారి గురించి చెప్పాలంటే- ఈ చిత్రం కోసం దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా దానిని తెరకెక్కించే విషయంలో పూర్తిగా విఫలమయ్యాడు. నారా రోహిత్ వంటి వైవిధ్య పాత్రలని ఎంచుకొనే హీరో దొరికినప్పుడు దర్శకుడిగా ఫెయిల్ అయితే ఏమవుతుందో ఈ చిత్రం చూస్తే తెలిసిపోతుంది.
మొత్తానికి ఈ వారం వచ్చిన రెండు ప్రధాన చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో ప్రేక్షకులు ఇంకొక నాలుగు రోజులపాటు ఆగి ఎన్టీఆర్ జైలవకుశ చూడాల్సిందే. ఈ రెండు చిత్రాలతో పాటు విడుదలైన శ్రీవల్లి, వీడెవడు సైతం ప్రేక్షకులని నిరాశకే గురిచేశాయి.