దాదాపు వారం రోజుల పాటు కొనసాగిన థియేటర్ల బంద్ తరువాత మొన్న గురువారం నుండే మళ్ళీ తెలుగునాట థియేటర్ల లో సినిమా ప్రదర్శనలు మొదలయ్యాయి. ఇక థియేటర్లు బంద్ తరువాత విడుదలైన తొలి సినిమా విజయ్ దేవరకొండ నటించిన ఏ మంత్రం వేసావె.
ఇక ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం. అర్జున్ రెడ్డి చిత్రం అనూహ్య విజయం తరువాత అందరూ ఊహించిన విధంగానే విజయ్ నుండి వచ్చిన ఏ మంత్రం వేసావె చిత్రం పైన ఆ ఇంపాక్ట్ పడింది. దానికి తోడుగా అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ పోషించిన పాత్రతో పోలిస్తే ఈ చిత్రంలో ఆయన పాత్ర తేలిపోయింది.
దర్శకుడు చెప్పాలనుకున్న కథాంశంలో బలం ఉన్నప్పటికీ కథనంలో పట్టులేకపోవడం, పాత్రల చిత్రీకరణలో విఫలమవ్వడంతో ఈ చిత్రం థియేటర్ల లో ప్రేక్షకుల ఓపికకి పరీక్ష పెడుతుంది. ఇక హీరోయిన్ కూడా అందం అలాగే అభినయం విషయాలలో వెనకపడడం ఈ చిత్రానికి అదనపు మైనస్.
ఇవన్ని కలిపి విజయ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లాపడింది. ఇక విజయ్ కూడా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి ముందుకు రాకపోవడం కొసమెరుపు.