త‌మ‌న్నాది ఐటెమ్ సాంగే.. కానీ కాద‌ట‌!

By Gowthami - October 23, 2019 - 10:47 AM IST

మరిన్ని వార్తలు

స‌రి లేరు నీకెవ్వ‌రు సినిమాలో త‌మ‌న్నా ఓ ప్ర‌త్యేక గీతంలో క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఇదేం ఐటెమ్ పాట కాద‌ట‌. కానీ ఐటెమ్ పాట‌లానే ఉంటుంద‌ట‌. మ‌హేష్ బాబుతో క‌లిసి ఓ సంద‌ర్భంలో స్టెప్పులేయ‌డానికి త‌మ‌న్నాని రంగంలోకి దించుతార్ట‌. అంతేత‌ప్ప‌.. త‌మ‌న్నాపై స్పెష‌ల్ ఫోకస్ చేస్తూ, ఈ పాట‌ని డిజైన్ చేయ‌లేద‌ట‌. క‌థ‌లో భాగంగా వ‌చ్చే పాట‌లో త‌మ‌న్నా వ‌స్తుంది త‌ప్ప‌, త‌మ‌న్నా కోసమే ప్ర‌త్యేకంగా పాట‌ని డిజైన్ చేయలేద‌ని చిత్ర‌బృందం చెబుతోంది.

 

దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ పాట‌ని ఇప్ప‌టికే కంపోజ్ చేసి రెడీగా ఉంచాడ‌ట‌. న‌వంబ‌రు తొలి వారంలో ఈ పాట‌ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ పాట కోసం హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేకంగా ఓ సెట్ కూడా రెడీ చేసి పెట్టార్ట‌. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అన్న‌ట్టు ఈ పాట‌లో ర‌ష్మిక కూడా ప్ర‌భాస్ తో పాటుగా చిందులేస్తుంద‌ని తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS