మిల్కీ బ్యూటీ తమన్నా డాన్సు నేర్చుకుంటోందట. షాకింగ్‌గా ఉంది కదా. కానీ ఇది నిజం. డాన్సుల్లో తమన్నాని ది బెస్ట్ అని చెప్పొచ్చు. కానీ 'సైరా నరసింహారెడ్డి' కోసం డాన్స్ నేర్చుకునే పనిలో తమన్నా బిజీగా ఉంది. శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం కోసం తమన్నా ఓ గురువును ఆశ్రయించింది. పాఠాలు నేర్చుకుంటోంది.
డాన్స్ అనేది ఓ కళ. ఎంత నేర్చుకున్నా నేర్చుకోవడానికి ఇంకా ఇంకా ఉంటూనే ఉంటుంది. డాన్సుల్లో దిట్ట అయిన తమన్నాకీ ఆ విషయం తెలుసు. శాస్త్రీయ నృత్యం అయినా, మోడ్రన్ డాన్స్ అయినా తమన్నాకి పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఇష్టంగా డాన్సుల్లో కొత్త లోతుల్ని తెలుసుకోవాలని తమన్నా చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించి తీరాల్సిందే. 'బాహుబలి' సినిమా కోసం తమన్నా గుర్రపుస్వారీ నేర్చుకుంది. ఇప్పుడు 'సైరా' కోసం తమన్నా డాన్స్ నేర్చుకుంటోంది.
ఎప్పుడో పదేళ్ల క్రితం సినీ రంగంలోకి వచ్చిన తమన్నా, ఇప్పటికీ తన స్టార్‌డమ్ తగ్గకుండా చూసుకుంటోందంటే చిన్న విషయం కాదు. కఠోర శ్రమ ఎవరినైనా ఏ రంగంలోనైనా మంచి పొజిషన్‌లో నిలబెడుతుంది. ఈ సూత్రం తమన్నా విషయంలో నూటికి నూరు పాళ్లూ నిజం. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ, కళ్యాణ్‌రామ్‌తో నటించిన 'నా నువ్వే' సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది.
ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది తమన్నా.