అందమే ఆరోగ్యం. ఆరోగ్యమే అందం. కథానాయికలు పఠించే మంత్రం అదే. చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ, ఫిట్ నెస్‌ని కాపాడుకుంటూ.. ఆరోగ్యవంతంగా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు కథానాయికలు. అప్పుడప్పుడూ ఆ సీక్రెట్స్ కూడా అభిమానుల కోసం బయట పెడుతుంటారు. తమన్నా కూడా తన ఆరోగ్య రహస్యాన్ని చెప్పింది. కొన్ని చిట్కాలు అభిమానుల ముందు ఉంచిది.
కరోనా కాలం కదా. ఫిట్‌నెస్‌సెంటర్లకూ, జిమ్ములకూ వెళ్లడం తనకి ఏమాత్రం కుదరడం లేదట. అందుకే తన ఇంటినే ఓ జిమ్ లా మార్చేసింది. చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటోంది. ‘‘నీళ్ల బకెట్ ఎత్తడం కూడా ఒక ఎక్సర్‌సైజే. అలాగే ఇల్లు క్లీన్ చేయడం ఓ మంచి వ్యాయామం. వీటితో పాటు ఇంటి బయట ఉన్న ఖాళీ స్థలంలో కాసేపు పరిగెత్తడం, ఉదయాన్నే యోగా చేయడం వంటి వాటితో నా ఫిజికల్, మెంటల్ హెల్త్‌ని కాపాడుకుంటున్నాను. ఫిట్‌నెస్ అనేది నా జీవితంలో ఒక భాగమైపోయింది. నా ఫిట్‌నెస్ మంత్ర ఏంటంటే.. త్వరగా నిద్రపోతాను. త్వరగా నిద్రలేస్తాను. అయితే 8 గంటలు నిద్రపోతాను. ఇప్పుడు కరోనా వైరస్‌లాంటి వాటివల్ల మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఉసిరికాయ జ్యూస్ బెస్ట్ లేదా గ్రీన్ టీ’’ అని చెప్పుకొచ్చింది తమన్నా.