ఈమధ్య తెలుగు సినిమాలు హిందీలోకి డబ్ కావడం, యూట్యూబ్ లోనూ, టీవీ ఛానెల్స్ లో వాటికి భారీ ఆదరణ దక్కడం సాధారణంగా మారింది. కొన్ని సినిమాలు అయితే ఏకంగా వందలకొద్దీ మిలియన్ల వ్యూస్ సాధిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. అదే కోవలో వరుణ్ తేజ్ నటించిన ప్రేమ కథా చిత్రం 'తొలిప్రేమ' అలాంటి ఒక అరుదైన ఫీట్ సాధించింది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'తొలిప్రేమ' 2018 లో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. పోయిన ఏడాది ఆగస్టు 4 వ తారీఖున యూట్యూబ్ లో ఆ సినిమా డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేశారు. సరిగ్గా ఏడాదికి 'తొలిప్రేమ' 100 మిలియన్ల వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు 877k లైక్స్ కూడా రావడం మరొక విశేషం.
ఏదేమైనా ఒక బిలియన్ వ్యూస్ సాధించడం ఆషామాషీ విషయం మాత్రం కాదు. సినిమాలో ఆ రేంజ్ కంటెంట్ ఉంటేనే హిందీ ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉంటుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మించారు.