బెల్లంకొండతో తమన్నా మళ్లీనా?

By iQlikMovies - May 22, 2017 - 13:31 PM IST

మరిన్ని వార్తలు

ఇటీవలే 'స్పీడున్నోడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్‌ త్వరలోనే ఓ యాక్షన్‌ మూవీతో మన ముందుకు రానున్నాడు. శ్రీవాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'డిక్టేటర్‌' సినిమా తర్వాత శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఇది. శ్రీనివాస్‌ నటించిన గత చిత్రాల్లో వరుసగా రెండు సినిమాల్లో తమన్నా ఐటెం సాంగ్‌లో నటించింది. ఆ రెండు సినిమాలు శ్రీనివాస్‌కి విజయాన్ని అందించాయి. దాంతో తమన్నాని ఈ సారి తన సినిమాకి హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఇటీవలే 'బాహుబలి ది కన్‌క్లూజన్‌' సినిమాలో చాలా తక్కువ సమయం పాటు తళుక్కున మెరిసింది మిల్కీ బ్యూటీ. ఈ సారి బెల్లంకొండతో జత కట్టబోతోందంటూ గాసిప్స్‌ వినవస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో తమన్నా చేతిలో సినిమాలు లేవు. ఒకవేళ ఈ సినిమాకి ఒప్పుకుంటే బెల్లంకొడ శ్రీనివాస్‌ సినిమాకి మిల్కీ బ్యూటీ అదరిపోయే గ్లామర్‌ అద్దినట్టే. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందించనున్నారు. తొలి సినిమా 'అల్లుడు శీను' కోసం దేవిశ్రీ అదిరిపోయే మ్యూజిక్‌నందించారు. బెల్లంకొండ మంచి డాన్సర్‌. కాబట్టి, మాంచి మాస్‌ బీటున్న సాంగ్స్‌ని దేవి ఈ సినిమాకి కంపోజ్‌ చేయనున్నారట. అలాగే హ్యాండ్‌సమ్‌ జగపతిబాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేయనున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS